Raghava Lawrence Rudrudu Movie Talk: రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫైనాన్స్ కష్టాల వల్ల రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నారో ఏమో తెలియదు కానీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన ప్రేక్షకులు అందరూ ఇదేం సినిమా రా బాబోయ్ అనుకుంటూ ధియేటర్ల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలో విలక్షణమైన సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో తెలుగు మాత్రమే కాదు తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలోని దర్శక నిర్మాతలు సైతం కొత్త, ఆసక్తికరమైన కథలు తెరమీదకు తీసుకువచ్చి సినిమాలుగా మలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ రుద్రుడు సినిమా చూసిన తర్వాత రాఘవ లారెన్స్ ఇంకా ఏ కాలంలో ఉండిపోయాడు? అని అనుమానం కలగక తప్పదు. ఈ సినిమా ఒక రొటీన్ రివెంజ్ డ్రామా దానికి అమ్మ సెంటిమెంట్ అనే ఒక సెంటిమెంట్ కలిపారు. కానీ అది ఏ మాత్రం వర్కౌట్ అయింది అంటే అసలు ఏ మాత్రం అవలేదనే చెప్పాలి. ఒక ఐటీ ఉద్యోగిగా పని చేసే రుద్ర కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లాల్సి వస్తుంది. తన తల్లిని చూసేందుకు భార్యను పంపిస్తే భార్య మిస్ అవుతుంది, తల్లి చనిపోయి ఉంటుంది. 


ఇదీ చదవండి: Pooja Hegde Dating: సల్మాన్ తో పూజా డేటింగ్.. అందుకే ఏమీ మాట్లాడడం లేదట!


తల్లి ఎలా చనిపోయింది? భార్య ఏమైంది అని తెలుసుకునే ప్రయత్నమే ఈ సినిమా. తీసుకున్న పాయింట్ కాస్త కొత్తగా అనిపించినా ఏ మాత్రం లాజిక్స్ కి అందని విధంగా ఉంది. పోనీ ఆ సంగతి పక్కన పెడితే సినిమా మొత్తం మీద లారెన్స్ హీరోయిజం చూపించేందుకు ఆసక్తి చూపించారు తప్ప కథ మీద కానీ కథనం మీద కానీ స్క్రీన్ ప్లే మీద కానీ ఏ మాత్రం దృష్టి పెట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఎన్.కదిరేశన్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఒక పూర్తి స్థాయి క్రైమ్ స్టోరీ కానీ దానికి మెలో డ్రామా కలిపి అమ్మ సెంటిమెంట్ అనే యాంగిల్ కూడా జోడించారు.


ఫలితంగా సినిమా ఏ మాత్రం ఆసక్తి కలిగించలేదు సరి కదా ప్రేక్షకులను బోర్ కి గురయ్యాలా చేస్తుంది. అలాగే ఎప్పుడో ఈ సినిమా చూసేసాను కదా అనే ఫీలింగ్ కూడా కలుగుతుందంటే ఆశ్చర్యం లేదు. అలాగే ఈ సినిమాల్లో లారెన్స్ ఫైట్లు చూస్తే కనుక తెలుగు వారందరికీ అఖండ సినిమాలో బాలకృష్ణ ఫైట్లు గుర్తొస్తాయి. నిజానికి ఆ అఖండ సినిమాకి ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా వ్యవహరించింది ఒక్కరే, స్టంట్ శివ.


అఖండ ఫైట్లు కావాలని లారెన్స్ అడిగాడో లేక అవి బాగా వర్కౌట్ అయ్యాయని ఈయనే కంపోజ్ చేశాడో తెలియదు కానీ రక్తపాతం ఎక్కువగానే ఉన్న ప్రేక్షకులను మాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. తమిళ ప్రేక్షకులు ఆదరించే అవకాశాలున్నాయేమో కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ధైర్యం చేసి సినిమాకి వెళ్లినా ఇదేం సినిమా రా నాయనా అనుకుంటూ బయటకు రావడమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ మీరు రుద్రుడు సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.


ఇదీ చదవండి: Actress Prema: రెండో పెళ్లిపై ఓపెన్ అయిన హీరోయిన్.. చేసుకుంటా తప్పేముందంటూ!


నోట్: 
ఈ సమాచారం ఆన్లైన్ లో పలు మాధ్యమాల ద్వారా సేకరించినది. ఈ వార్తను జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook