Chiranjeevi Acharya Shooting: రాజమండ్రిలో చిరంజీవికి అపూర్వ స్వాగతం, ఏజెన్సీ ప్రాంతంలో Acharya Shooting
Chiranjeevi For Acharya Shooting At Maredumilli: కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఆచార్య మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది.
Chiranjeevi For Acharya Shooting At Maredumilli: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆచార్య. కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతేక పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఆచార్య మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chirajeevi) ఆదివారం ఉదయం రాజమండ్రి మధురపూడి ఎయిర్‌పోర్ట్ చేరుకోగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు అభిమానులకు అభివాదం తెలిపిన అనంతరం రోడ్డు మార్గాన మారేడుమిల్లి ఏజెన్సీకి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు చిరంజీవి.
Also Read: DA Hike Latest News: డియర్‌నెస్ అలవెన్స్ 13 శాతం వరకు పెరగవచ్చు, Holiకి ముందే ఉద్యోగులకు DA Hike
చిరంజీవి రాకను తెలుసుకున్న మెగా అభిమానులు జన ప్రవాహంలా అక్కడికి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకునే వరకు మెగా అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు రెండు వారాలపాటు ఇక్కడ ఆచార్య షూటింగ్(Acharya Shooting) జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
Also Read: Acharyaలో రామ్ చరణ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
మరోవైపు చిరంజీవి బ్యాన్సర్లు, ఫ్లెక్సీలతో రాజమండ్రి చిరుమయం అయిపోయింది. సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నటుడు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా ఆచార్య మూవీని నిర్మిస్తున్నారు.
Also Read: Kajal Aggarwal at Acharya sets: హనీమూన్ నుంచి ఆచార్య సెట్‌కు కాజల్, గౌతమ్ కిచ్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook