Rajamouli: రామోజీరావ్ కి భారతరత్న ఇవ్వాలి.. ఎమోషనల్ అయిన దర్శకుడు రాజమౌళి
Ramoji Rao: రామోజీరావ్ మరణవార్తతో…తెలుగు ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగింది. ఈ క్రమంలో రామోజీరావ్ పార్థివదేహాన్ని సందర్శించడానికి వెళ్లిన దర్శకుడు రాజమౌళి చాలా ఎమోషనల్ అయ్యారు.. ఆయనకి తప్పకుండా భారతరత్న ఇవ్వాలి అని కోరారు..
Ramoji Rao-Rajamouli::తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అంటే.. అందుకు కారణం ఎందరో మహానుభావులు. వారిలో ఒకరు రామోజీరావ్. ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థ ద్వారా ఎన్నో సినిమాలు నిర్మించడమే కాకుండా.. ఎంతోమంది గొప్ప దర్శకులను, గొప్ప నటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హిందీ ఇండస్ట్రీలో సైతం ఎన్నో సినిమాలు నిర్మించారు. కాగా రామోజీరావ్ ఈరోజు ఉదయం స్వర్గస్తులవ్వడంతో .. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది.
ఆయన పార్ధివదేహం చూడడానికి.. సినీ ఇండస్ట్రీ మొత్తం కదలి వస్తోంది. ఈ క్రమంలో రాజమౌళి కూడా తన కుటుంబ సభ్యులందరితో.. కలిసి వెళ్లి.. కొద్ది గంటల క్రితమే రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం దర్శకుడు రాజమౌళి కంటతడి పెడుతున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామోజీరావుని చూడగానే రాజమౌళి ఎంతో ఎమోషనల్ అయ్యి కంతతడి పట్టుకున్నారు. రామోజీరావు తో దర్శకుడు రాజమౌళి చాలా సన్నిహితంగా మెలిగే వారని చెబుతూ ఉంటారు. ఇక ఈరోజు రాజమౌళి కంటతడి చూస్తే ఆయనకి రామోజీరావుతో ఎంతటి అనుబంధం ఉందో అర్థమవుతుంది.
రాజమౌళి సినిమా దర్శకుడు కాకముందు.. శాంతి నివాసం అనే సీరియల్ తో దర్శకుడిగా మారారు. ఈ శాంతి నివాసం సీరియల్.. రామోజీరావు అధినేత అయిన ఈటీవీ లోనే ప్రసారమయ్యేది. అలా అప్పుడు రామోజీరావు తో రాజమౌళికి ఏర్పడిన పరిచయం.. తర్వాత సాన్నిహిత్యంగా మారిందట. ఇక అప్పటినుంచి రామోజీరావు గారు అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. ఇక రామోజీరావు మృతి చెందిన విషయం తెలియగానే.. రాజమౌళి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ‘ఒక వ్యక్తి తన 50 సంవత్సరాల స్థితిస్థాపకత, కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి ఉపాధి, జీవనోపాధి, ఆశలను అందించారు’ అని పోస్ట్ వేశారు రాజమౌళి. ఇక రామోజీ రావు గారికి మనం నివాళులు అర్పించే ఏకైక మార్గం “భారతరత్న” ప్రదానం చేయడం ద్వారా అంటూ కూడా రాజమౌళి పేర్కొన్నారు.
Also Read:ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై వైద్యం?
Also Read:ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావుపై మెగాస్టార్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter