Rajamouli Birthday : దర్శకధీరుడి పుట్టిన రోజు.. ఇండియన్ సినిమాకు `రాజ`మౌళి
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాకు ముఖ చిత్రంగా మారాడు. ది ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారిపోయాడు. ప్రపంచ దేశాల ముందు రాజమౌళి ఇండియన్ పతాకాన్ని ఎగురవేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి మన దేశ చలన చిత్ర రంగాన్నిప్రపంచ స్థాయిలో నిలబెట్టేశాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి స్థాయి పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా వెస్ట్రన్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
HBD Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాకు ముఖ చిత్రంగా మారాడు. ది ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారిపోయాడు. ప్రపంచ దేశాల ముందు రాజమౌళి ఇండియన్ పతాకాన్ని ఎగురవేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి మన దేశ చలన చిత్ర రంగాన్నిప్రపంచ స్థాయిలో నిలబెట్టేశాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి స్థాయి పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా వెస్ట్రన్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
హాలీవుడ్ డైరెక్టర్లు, క్రిటిక్స్, ఆడియెన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాను కీర్తిస్తున్నారు. అంతర్జాతీయ మేగజైన్ వెరైటీ సంస్థ కూడా ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ వస్తుందని, ఎన్టీఆర్ రామ్ చరణ్‌లు నామినేట్ అయ్యే చాన్స్ ఉందంటూ ఊరించింది. చివరకు ఇండియన్ నుంచి అధికారికంగా ఆర్ఆర్ఆర్ సినిమాను పంపించలేదు. దీంతో చిత్రయూనిట్ స్వయంగా అన్ని కేటగిరీల్లో ఆస్కార్ నామినేషన్‌కు పంపించేసింది.
అయితే ఆస్కార్ అవార్డు కచ్చితంగా రావాల్సిందే అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేటి రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఆస్కార్ అవార్డు మీదే చర్చ జరుగుతోంది. రాజమౌళికి ఆస్కార్ రావాలని అంతా కోరుకుంటున్నారు. ఈ సమయంలో రాజమౌళి కెరీర్ ఒక్కసారి పరిశీలిద్దాం. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలైందన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు శాంతినివాసం అనే సీరియల్‌తో బుల్లితెరపై సంచలనం సృష్టించాడు.
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన రాజమౌళి జైత్రయాత్ర.. ఆర్ఆర్ఆర్ వరకు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. పేరులో ఉన్నట్టుగానే సినీ సామ్రాజ్యానికి రాజుగా రాజమౌళి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎంతటి స్టార్ దర్శకుడికైనా తన కెరీర్లో ఒక్కసారైనా ఓటమిని చవిచూస్తాడు. కానీ రాజమౌళి మాత్రం ఇంత వరకు ఓటమిని చూడలేదు.
బహుషా ఆ ఓటమికి కూడా రాజమౌళి అంటే భయమేమో. రాజమౌళి పర్ఫెక్షన్.. అన్ని క్రాఫ్ట్స్ మీద ఉండే పట్టును చూసిన ఓటమి సైతం.. రాజమౌళి ముందు గులామైనట్టుంది. అందుకే తాను దూరంగా ఉండి.. గెలుపుని దగ్గరగా ఉంచినట్టుంది. అలా ఓటమి ఎరుగని దర్శకధీరుడిగా రాజమౌళి ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారాడు. మరి మహేష్ బాబుతో ప్రపంచం ఆశ్చర్యపోయే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Globetrotting అంటూ ఆయన ఇచ్చి హింట్, ఆ పదం ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్నికూడా త్వరగా తీసి.. ప్రపంచం మొత్తాన్ని మంత్రముగ్దం చేయాలని కోరుకుంటూ Zee Telugu News రాజమౌళికి ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతోంది.
Also Read : Nayanthara twin boys: కవల పిల్లలకు తల్లితండ్రులైన నయనతార-విగ్నేష్ శివన్.. పెళ్లైన నాలుగు నెలలకే!
Also Read: Chiranjeevi Old Video Viral: గరికపాటిది తప్పయితే మెగాస్టార్ ది కూడా తప్పేగా.. చిరు పాత వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook