RRR సీక్వెల్.. మొదలుపెట్టిన విజయేంద్ర ప్రసాద్.. మ్యాటర్ చెప్పిన రాజమౌళి
Rajamouli Idea About RRR Part 2 రాజమౌళి తాజాగా ఆర్ఆర్ఆర్ రెండో పార్ట్ మీద కామెంట్ చేశాడు. సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉందంటూ రాజమౌళి తన మనసులోని మాట చెప్పేశాడు.
Rajamouli Idea About RRR Part 2 : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. వెస్ట్రన్ కంట్రీస్‌లో ఆర్ఆర్ఆర్ మీద ఎంత నెగెటివ్ కామెంట్లు వచ్చాయో.. అంతకు మించిన పాజిటివ్ కామెంట్లు పడ్డాయి. హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆర్ఆర్ఆర్‌ను నెత్తిన పెట్టుకున్నారు. మన దేశం నుంచి ఆస్కార్ ఎంట్రీకి ఈ సినిమాను ఎంపిక చేయకపోయినా కూడా యూఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మన సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు పంపించింది.
మొత్తానికి అన్ని కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కోసం పోటిపడుతుంది. బెస్ట్ యాక్టర్, డైరెక్టర్ కేటగిరీల్లో మనవాళ్లు అవార్డులు కొల్లగొడతారో లేదో చూడాలి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా మీద మరో కొత్త చర్చ మొదలైంది. ఈ మధ్యే ఈ చిత్రాన్ని జపాన్‌లో విస్తృతంగా ప్రచారం చేసింది చిత్రయూనిట్. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీలతో సహా వెళ్లి అక్కడే ఉండి ప్రచారం చేశారు. సినిమా కూడా బాగానే హిట్ అయి వసూళ్లను సాధిస్తోంది.
ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 మీద స్పందించాడు. నా సినిమాలన్నంటికి మా నాన్నే కథలు రాస్తారు.. RRR2 కోసం మేం ఇద్దరం చర్చించుకున్నాం.. ఆయన ఈ కథ మీద ఫోకస్ పెట్టేశారు అని సీక్వెల్ గురించి హింట్ ఇచ్చాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ భీమ్ ఇద్దరూ ఫ్రెండ్స్.. ఇద్దరూ ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకోగల స్నేహితులు.. కానీ కొట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.. చంపుకునే వరకు వచ్చారు.. ఇంకో సినిమా తీయాలంటే.. వారిద్దరినీ ఎలా చూపించాలి.. ఎలా కన్విన్స్ చేయాలో.. మళ్లీ ఏ కారణంతో కొట్టుకుంటారు.. పైగా నాటు నాటు వంటి మరో పాటను ఎలా పెట్టగలను అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.
మరి రాజమౌళి అయితే ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇంకా ఈ కథను కూడా ఫైనల్ చేయలేదు. అలాంటిది ఆర్ఆర్ఆర్ ఇంకో పార్ట్ కథ అంటే ఇప్పట్లో రాదని నెటిజన్లు అంటున్నారు. మరి రాజమౌళి ఎలాంటి ప్లాన్స్ వేస్తాడో చూడాలి.
Also Read : Varsham 4K Special Screening : అతి చేసిన త్రిష.. హర్టైన ప్రభాస్ అభిమానులు.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్
Also Read : Baladiya Buzz Interview : గీతూ ఎలిమినేషన్.. బాలాదిత్య కామెంట్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook