మెగాఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chirajneevi ), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో అదరగొట్టనున్నారు. ఈ విషయంలో రాజమౌళి ఓకే అన్నట్టు తెలిసింది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఆచార్య ( Acharya ) చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఉండగా ఇటీవలే కాపీ స్టోరీ అంటూ వివాదం కూడా వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే


కరోనావైరస్ ( Coronavirus ) వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ ( Ram Charan ) - రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న RRR చిత్రం నుంచి అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప వరకు అన్ని చిత్రాల షూటింగ్స్ ఆగిపోయాయి.


అందులో ఆచార్య సినిమా కూడా ఉంది. అయితే ఇటీవలే మళ్లీ షూటింగ్స్ మొదలు కావడంతో ఆచార్య మూవీని మళ్లీ షూటింగ్ మోడ్ లోకి తీసుకెళ్లాలి అని ప్లాన్ చేస్తున్నారట.


కాగా ఆచార్య మూవీలో రామ్ చరణ్ కీలక పాత్ర చేయాల్సి ఉంది. కానీ రాజమౌళి సినిమా కూడా ఇదే టైమ్ లో షూటింగ్ జరిపే అవకాశం ఉండటంతో ఆ ఛాన్స్ ఉండదేమో అనుకున్నారు. కానీ జక్కన్న రాజమౌళి మాత్రం ఆచార్య మూవీలో చరణ్ నటించేందుకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని తెలిపాడట.


ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట


దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారట. కాగా ఆచార్య మూవీలో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా కనిపించనున్నారట. రామ్ చరణ్ న్యాయం కోసం ప్రశ్నించే తత్వం ఉన్న రెబల్ యువకుడి పాత్రలో నటించనున్నాడట. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR