ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే అటు క్రికెట్ అభిమానులకు డబుల్ మజా... ఫ్రాంచైజీలుకు కాసుల పంట..అదే విధంగా ఆటగాళ్లకు డబ్బులే డబ్బులు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే అటు క్రికెట్ అభిమానులకు డబుల్ మజా... ఫ్రాంచైజీలుకు కాసుల పంట..అదే విధంగా ఆటగాళ్లకు డబ్బులే డబ్బులు. అయితే కొంత మంది ఆటగాళ్లు మాత్రం ఇతరుల కంటే ఎక్కవ విలువ చేస్తారు. వారి ఆటతీరే దానికి కారణం. ఇలా వారి ఆట వల్ల ఖరీదైన ఆటగాళ్లుగా మారిన క్రీడాకారులు వీరే
మాజీ టీమిండియా డ్యాషింగ్ ఆల్ రౌండర్ యువ్ రాజ్ సింగ్ డిల్లీ ఢేర్ డెవిల్స్ తరపున సీజన్ -8లో 16 కోట్లు తీసుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న కోహ్లీ 2018లో రూ.17 కోట్లు తీసుకున్నాడు.
ముంబై ఇండియన్స్ ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న రోహిత్ శర్మ దీనికి గాను రూ.15 కోెట్లు పారితోషికం తీసుకుంటున్నాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన పాట్ కమిన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ రూ.15.5 కోట్లకు సొంతం చేసుకుంది.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చైన్నై సూపర్ కింగ్ సారథి ప్రస్తుతం రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు.