Rajamouli Spending nearly 50 crores : దర్శకధీరుడు రాజమౌళి పట్టిందల్లా బంగారం అవుతుంటుంది. రాజమౌళి తెరకెక్కించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడలేదు. కొన్ని లాభాల్లో ఆకాశం ఎత్తులో ఉంటే.. ఇంకొన్ని లాభాల్లో ఓ మాదిరి స్థాయిలో ఉంటాయి. అలా బాహుబలి సినిమాకు ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓ మోస్తరు లాభాలే వచ్చాయి. మొత్తంగా పదిహేను వందల కోట్లు కూడా కొల్లగొట్టలేకపోయింది ఆర్ఆర్ఆర్ సినిమా. అయితే RRR సినిమాకు తెలుగులో గొప్ప టాక్ ఏమీ రాలేదు. నార్త్ ఆడియెన్స్‌ను బాగానే మెప్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెస్ట్రన్ ఆడియెన్స్ RRR చిత్రాన్ని నెత్తిన పెట్టేసుకున్నారు. అయితే కొందరు మాత్రం ఆ సినిమాను దారుణంగా ఏకిపారేశారు. గే సినిమా అంటూ గేలి చేశారు. అయితే జపాన్ వంటి దేశంలోనూ RRR చిత్రం బాగానే ఆడుతోంది. ఓవర్సీస్‌ అన్నిచోట్లా బాగానే నడిచింది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ డైరెక్టర్స్, క్రిటిక్స్, నటీనటులను ఆర్ఆర్ఆర్ ఇంప్రెస్ చేసింది.


అయితే ఈ సారి RRR కచ్చితంగా ఆస్కార్ అవార్డులు కొల్లగొడతాయ్ అని హాలీవుడ్ మేగజైన్ వెరైటీ ప్రకటించింది. రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లకు అవార్డు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియా నుంచి కూడా అఫీషియల్ ఎంట్రీ వస్తుందని అనుకున్నారు. కానీ మన దేశం నుంచి ఈ సినిమాను కేంద్రం ఎంపిక చేయలేదు. కానీ రాజమౌళి మాత్రం అంతటితో ఆగలేదు. హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాను ఆస్కార్‌ బరిలో ఉండేట్టు ప్రయత్నాలు చేశాడు.


అకాడమీ సభ్యుల ఓటింగ్ ఆస్కార్ అవార్డు ఫైనల్ అవుతుందని అందరికీ తెలిసిందే. ఇక ఈ ఓటింగ్‌ను రాజమౌళి మ్యానిపులేట్ చేసేట్టుగా కనిపిస్తోంది. దీని కోసం యాభై కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను ఇంకా ప్రపంచంలోని వివిద దేశాల్లో ప్రచారం చేస్తూనే ఉన్నాడు. మరి రాజమౌళి కష్టం ఫలిస్తుందా?.. ఆస్కార్ అవార్డు లభిస్తుందా? అన్నది చూడాలి.


Also Read : Superstar Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. గుండెలు మెలిపెట్టేలా మహేష్‌ బాబు తొలి పోస్ట్


Also Read : kantara Movie Varaha roopam Song : కాంతారా నిర్మాతలకు దెబ్బ మీద దెబ్బ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook