Superstar Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. గుండెలు మెలిపెట్టేలా మహేష్‌ బాబు తొలి పోస్ట్

Mahesh Babu First Reaction on Father Death మహేష్‌ బాబు తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణం మీద స్పందించాడు. తండ్రి మరణించిన పదిరోజుల తరువాత ఇలా స్పందించాడు. ఇన్ని రోజులు బాధలో ఉన్న మహేష్‌ ఇలా తన తండ్రి మీద ప్రేమను కురిపించాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 05:55 PM IST
  • ఘట్టమనేని ఇంట వరుస విషాదాలు
  • సూపర్ స్టార్ కృష్ణ మరణం
  • మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
Superstar Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. గుండెలు మెలిపెట్టేలా మహేష్‌ బాబు తొలి పోస్ట్

Mahesh Babu First Reaction on Father Death : మహేష్‌ బాబు తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణం మీద స్పందించాడు. మీ జీవితం ఎప్పుడూ పండుగలానే సాగింది.. మీ అంతిమ యాత్ర కూడా అలానే సాగింది.. అదే మీ గొప్పదనం.. ఏ భయం బెరుకూ లేకుండా బతికేశారు.. డేరింగ్ డాషింగ్ అనేది మీ వ్యక్తిత్వం.. మీరే నాకు స్పూర్తి.. మీరే నా ధైర్యం..

అదే మీ నుంచి నేను నేర్చుకున్నాను.. మిమ్మల్ని చూస్తూ పెరిగాను.. ఇప్పుడు నాలో ఉన్న ఈ ధైర్యం, బలం ఇది వరకు ఎన్నడూ నేను అనుభవించలేదు.. ఇమీ కాంతి, మీ శక్తి ఎప్పుడూ నాలోనే ఉంటుందని ఇప్పుడు నేను ఏ భయం బెరుకూ లేకుండా చెప్పగలను.. మీ వారసత్వాన్ని, మీ గౌరవాన్ని, మీ పరువు ప్రతిష్టలను నేను ముందుకు తీసుకెళ్తాను నాన్నా.. మీరు ఇంకా గర్వపడేలా చేస్తాను నాన్నా.. లవ్యూ నాన్నా.. మీరే నా సూపర్ స్టార్ అంటూ గుండెలు మెలిపెట్టేశాడు మహేష్‌ బాబు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

మహేష్‌ బాబు తన తండ్రి మరణించిన సమయంలో ఎంతగా ఎమోషనల్ అయ్యాడో ఆ వీడియోలన్ని ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.అసలే మహేష్‌ బాబు ఈ ఏడాది తన అన్న రమేష్‌ బాబు, తల్లి ఇందిరమ్మను పోగొట్టుకున్నాడు. ఆ బాధల్లోంచి తేరుకోక ముందే ఇలా నాన్నను కూడా పోగొట్టుకున్నాడు.

మహేష్‌ బాబు ఇలా ఈ ఏడాది అంతా కుంగిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇలా తండ్రి మరణించినా కూడా తన ధైర్యాన్ని మాత్రం విడనాడటం లేదు. తన తండ్రి తనలోనే ఉన్నాడంటూ మహేష్‌ బాబు చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.

Also Read : Manchu Vishnu Birthday : లేటుగా విష్ చేశాడట.. వెన్నెల కిషోర్ మీద మంచు విష్ణు ఫైర్.. నెటిజన్ల ట్రోలింగ్

Also Read : Shriya Saran lip lock : ఇది కామన్ ఏముంది అందులో.. బహిరంగంగా లిప్ లాక్ ట్రోలింగ్‌పై శ్రియా రియాక్షన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News