Rajamouli Attack: ఆ వ్యక్తిని కొట్టించాలనుకున్న రాజమౌళి.. అసలు ఏమైందంటే?
Rajamouli Vs Vegetable Vendor: రాజమౌళి చిన్ననాటి సమయంలో ఎప్పటికైనా డబ్బులు సంపాదించి ఒక వ్యక్తిని కొట్టించాలి అనుకున్నాడట, అలా ఎందుకు అనుకున్నాడు? అసలు విషయం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
Rajamouli Tried to Attack a Vegetable Vendor: శ్రీశైల శ్రీ రాజమౌళి అనగానే అంత ఈజీగా గుర్తుపట్టలేం కానీ ఎస్.ఎస్ రాజమౌళి అంటే గుర్తు పట్టని తెలుగువారు ఉండరేమో. ఇప్పుడు ఆయన ఖ్యాతి రాష్ట్రాలు, దాటి దేశాలు, దాటి ఖండంతరాలు కూడా దాటేసింది. గత ఏడాది ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు రాజమౌళి మీద తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన సినిమా ప్రేక్షకులకు అందించారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే అలాంటి రాజమౌళి చిన్ననాటి సమయంలో ఎప్పటికైనా డబ్బులు సంపాదించి ఒక వ్యక్తిని కొట్టించాలి అనుకున్నాడట. వినడానికి వింతగానే ఉన్న ఈ విషయాన్ని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పగా అది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే రాజమౌళి కుటుంబ సభ్యులందరూ కొవ్వూరు ప్రాంతానికి చెందిన వారు. కాగా సినిమాల మీద ఆసక్తితో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అప్పట్లో సినీ రచయితగా ఒక వెలుగు వెలగాలని మద్రాసు వెళ్లారు. ఆయనతో పాటు వారి ఉమ్మడి కుటుంబం కూడా అక్కడికి వెళ్లింది.
అలా మద్రాస్ వెళ్లిన సమయంలో ఆయనకు అవకాశాలు అంత ఈజీగా ఏమీ వచ్చేయలేదు. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఘోస్ట్ రైటర్ గా పనిచేసే అవకాశం దక్కింది. కానీ అప్పట్లో ఘోస్ట్ రైటర్లకి డబ్బులు ఎప్పుడు వస్తాయో? ఎప్పుడు రావో తెలియని పరిస్థితిలో వీరి కుటుంబ సభ్యులందరూ మద్రాసు వెళ్లారు కాబట్టి దాదాపు 17, 18 మంది కీరవాణి సంపాదన మీదే బతికేవారట. అప్పట్లో కీరవాణి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ గా పని చేస్తున్న సమయంలో ఆయనకు వచ్చే డబ్బు ద్వారానే వీరి కుటుంబమంతా గడిచేదట.
అయితే తన తండ్రి ఘోస్ట్ రైటర్ రెమ్యునరేషన్ డబ్బులు వచ్చినప్పుడు తీరుస్తామని చెబుతూ చుట్టుపక్కల ఉన్న పచారీ కొట్టు, కూరగాయల షాప్ వాళ్ళకి అప్పు పెట్టి సామాన్లు తెచ్చుకునే వారట. అలా ఒకానొక సమయంలో రాజమౌళి ఒక కూరగాయల వ్యాపారి దగ్గరకు వెళ్లి ఒక కేజీ టమాటాలు ఇవ్వమని అడిగితే ఆయన ఏదో పరధ్యానంగా ఉండి కాసేపు ఆగు రా అని కసురుకున్నారట. ఆ విషయాన్ని అవమానంగా భావించిన రాజమౌళి ఎప్పటికైనా తాను డబ్బులు సంపాదించి ఈ షాప్ అతన్ని కొట్టించాలని చిన్నప్పుడు బలంగా ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే అప్పటి వరకు ఆయనని రా అంటూ ఎవరూ పిలవలేదట. నన్ను రా అంటాడా అనే కోపంతో అలా ఫిక్స్ అయ్యాడని, కానీ ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటే నవ్వు వస్తుందని ఆయన కామెంట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి