SS Rajamouli Reaction after seeing Jr NTR for the First Time: నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి అనేక మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ వంటి వారు హీరోలుగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. వారి తర్వాతి తరంలో నందమూరి తారకరత్న, నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో జూనియర్ ఎన్టీఆర్ కి మొదటి నుంచి కుటుంబం సపోర్ట్ పెద్దగా దక్కలేదు. మొదటి సినిమా నిన్ను చూడాలి అనే సినిమా చేసిన తర్వాత రెండో సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయాలని ఎన్టీఆర్ చాలా ప్రయత్నాలు చేశాడు.
సీనియర్ ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో ఒక సినిమా ఎన్టీఆర్ తో చేస్తానని రాఘవేంద్రరావు ఆయనకు మాటిచ్చారట. ఆ మాట తప్పడం ఇష్టం లేక జూనియర్ ఎన్టీఆర్ రెండో సినిమాని రాఘవేంద్రరావు రూపొందించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ సినిమా చేసే సమయానికి ఆయన దర్శకత్వం మానేసి దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. ఒకపక్క రాజమౌళితో శాంతి నివాసం సీరియల్ చేస్తూ యాడ్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ఈ సినిమా అవకాశం రావడంతో రాజమౌళి దర్శకత్వం చేస్తున్న శాంతినివాసం సీరియల్ బాధ్యతలు రాజమౌళి కో డైరెక్టర్ కి అప్పగించి రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి దర్శకుడిగా మారారు.
అయితే మొదటి సినిమా అంటే ఎవరికైనా ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది చెప్పండి, రాజమౌళి కూడా అదే ఎక్సైట్మెంట్ లో మొదటి రోజు సెట్ కి వెళ్లాడట కానీ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ని చూసి ఒక్కసారిగా నిరుత్సాహ పడిపోయాడట. వీడేంటి ఇలా ఉన్నాడు అనవసరంగా ఇరుక్కుపోయానా అనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన గతంలో కామెంట్ చేశారు. ఎన్టీఆర్ ను చూసి ఓరి దేవుడా వీడు దొరికాడు ఏంట్రా బాబు అనుకున్నానని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ను చూసినప్పుడు బొద్దుగా మీసాలు లేకుండా నడక కూడా డిగు డిగు డిగు అంటూ వింతగా నడిచేవాడని, ఫస్ట్ సినిమా అంటే ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చామో వీడు దొరికాడు ఏంటి నా కర్మ అనుకున్నానని కానీ ఆ సినిమా చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ కు, తన మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చిందని అన్నారు.
అయితే ముందు నుంచి తనకు అన్నీ కరెక్ట్ గా ఉన్న గుర్రంతో రేసు గెలిస్తే ఉపయోగమేముంది, కుంటి గుర్రంతో కూడా గెలిచి చూపిస్తే కదా మన సత్తా ఏంటో తెలిసేది అనే మనస్తత్వం ఉందని ఎన్టీఆర్ తో కూడా అలాగే సర్దుకుపోవాలి అనుకున్నాను. కానీ సినిమా మొదలైన కొద్ది రోజులకే అతనిలో ఉన్న టాలెంట్ ఏంటో నాకు తెలిసి వచ్చిందని రాజమౌళి ఈ సందర్భంగా కామెంట్ చేశారు. అందంగా లేని హీరోతో సినిమా చేసి హిట్టు కొడితే కదా మన సత్తా ఏంటో తెలుస్తుందని భావించాను కానీ మొదట్లో పెట్టిన పది రోజులకే అతనిలో ఉన్న సత్తా ఏమిటో నాకు తెలియ చెప్పాడని ఈ సందర్భంగా రాజమౌళి కామెంట్ చేశారు.
అంటే ముందుగా ఎన్టీఆర్ ని చూసి రాజమౌళి వీడు దొరికాడు ఏంట్రా అనుకున్నారు. తర్వాత ఆయన ఒక కుంటి గుర్రం అని భావించారు, కానీ ఈరోజు ఆయనలో ఉన్న నటనను ప్రపంచ దేశాలు గుర్తించేలా చేశారు. ఇప్పటికీ రాజమౌళి ఎన్టీఆర్ మధ్య చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. రాజమౌళి మొదటి సినిమా ఎన్టీఆర్ తో చేయగా ఎన్టీఆర్ రెండో సినిమా రాజమౌళితో చేశారు. అలా ఇద్దరు దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ మొదలు పెట్టారు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆస్కార్స్ వరకు వెళ్లి తెలుగు సినిమా సత్తాని చాటుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి