Koratala Shiva Upcoming Movies: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్‌లో తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు.. కొరటాల శివ. అతను తీసే సినిమాలకు.. ప్రస్తుతం మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ప్రతి సినిమాలో.. ఏదో ఒక సామాజిక అంశాన్ని హైలైట్ చేయాలి అనే తపన కూడా కొరటాల శివ లో కనిపిస్తుంది. అందుకే అతని సినిమాలలో అభ్యుదయ భావాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటివరకు డైరెక్టర్ గా..కొరటాల తెరకెక్కించిన చిత్రాలు కేవలం ఐదే అయినప్పటికీ..అతను టాలీవుడ్  టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. ఈ దర్శకుడికి ఏదైనా.. ఒక డిజాస్టర్ ఉంది అంటే అది ఆచార్య మాత్రమే. ఈ సినిమా వల్ల చిరంజీవి కొరటాల మధ్యలో పెద్ద వార్..కూడా నడిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2002లో విడుదలైన గర్ల్ ఫ్రెండ్.. అనే మూవీకి స్టోరీ అందివ్వడంతో కొరటాల శివ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత సుమారు 8 సినిమాలకు.. అతను మాటలు అందించాడు. అయితే 2010లో నటసింహం, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన తో  సింహ మూవీని కొరటాల సోలోగా హ్యాండిల్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన కథ ,మాటలు మొత్తం కొరటాల అందివ్వడం విశేషం. తాను రాసిన కథకు డైరెక్టర్ కంటే కూడా తానే బాగా డైరెక్ట్ చేయగలను అనే భావన కొరటాలలో నాటుకు పోయింది. దీంతో రైటర్ కాస్త డైరెక్టర్ అవ్వాలి అన్న భావన కొరటాలలో పెరుగుతూ వచ్చింది.


 అవకాశం చూస్తున్న టైం లో  కొరటాలకు మంచి ఫ్రెండ్ అయిన వంశీకృష్ణ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడు.  ప్రభాస్ తనకు సన్నిహితులు కాబట్టి  డార్లింగ్ తన మూవీకి డేట్స్ ఇస్తాడు అనే నమ్మకంతో వంశీకృష్ణ కొరటాలను తీసుకొని ప్రభాస్ దగ్గరకు వెళ్ళాడు. రెబల్ మూవీ డిజాస్టర్..కావడంతో మంచి బ్రేక్ కోసం చూస్తున్న ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ రాజమౌళితో బాహుబలి కోసం అప్పటికే కమిట్ అయిపోయాడు. .


కొరటాలు చెప్పిన స్టోరీ ప్రభాస్ కు చాలా బాగా నచ్చింది కానీ ప్రస్తుతం సినిమా చేసే టైం లేదు. ఈ నేపథ్యంలో రాజమౌళితో ఇదే విషయాన్ని ప్రభాస్ డిస్కస్ చేయడంతో.. రాజమౌళి ‘స్టోరీ బాగున్నప్పుడు చేయడంలో తప్పేముంది. ఇంత మంచి స్టోరీని అస్సలు మిస్ చేసుకోవద్దు. మన మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా సిక్స్ మంత్స్ టైం ఉంది. ఈలోపు ఆ సినిమాని పూర్తిచేయి’ అని ఎంకరేజ్ చేశారట. అలా కొరటాల డైరెక్షన్లో ప్రభాస్ మిర్చి మూవీ లో నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.  బాహుబలి పూర్తయ్యాక ప్రభాస్ తో కొరటాల శివకు సినిమా చేసే ఛాన్స్ దొరికేది కాదు.. అంటే ఒకరకంగా తీసుకుంటే రాజమౌళి చలవ వల్లే కొరటాలలోని..డైరెక్టర్ బాగా ఎలివేట్ అయ్యాడు.


Also Read: Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలు


Also Read: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్‌సుఖ్‌నగర్‌ దిగ్బంధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook