Rajendra Prasad becomes emotional: తెలుగు సినీ ఇండస్ట్రీకి దొరికిన అతి తక్కువ మంది.. ఆణిముత్యాలలో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. తొలుత కామెడీ హీరోగా కెరియర్ మొదలుపెట్టిన ఈయన విభిన్నమైన గెటప్లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అతి తక్కువ సమయంలోనే.. స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు రాజేంద్రప్రసాద్. కామెడీ హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా మెప్పించిన ఈయన  మేడమ్ వంటి చిత్రాలతో అవార్డులు కూడా దక్కించుకున్నారు. ముఖ్యంగా లేడీ గెటప్లలో ఆయన నటించిన తీరుకి అందరూ ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపోతే ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఎక్కువగా హీరోలకు , హీరోయిన్లకు తండ్రి క్యారెక్టర్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన తాజాగా పుత్రికా శోకంతో విలవిలాడుతున్న విషయం తెలిసిందే. న్యూరాలజిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఈయన కూతురు గాయత్రి ఉన్నట్టుండి 38 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా తండ్రి మరణంతో పూర్తిగా మానసిక క్షోభ అనుభవిస్తున్న రాజేంద్రప్రసాద్ తాజాగా మరోసారి కూతుర్ని తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 


ఇటీవల ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మీ అందరికీ తెలుసు ఇటీవలే నేను కన్నా కూతురు నాకు బై బై చెప్పి పైకి వెళ్ళిపోయింది. అంటూ ఆ బాధను దిగమింగుకుంటూ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ కంటినిండా కన్నీళ్లను నింపుకొని బయటకు రానివ్వకుండా మానసిక క్షోభ అనుభవించారు. రాజేంద్రప్రసాద్ కూతురు పోయిన దుఃఖంలో ఉండి కూడా ఆయన ముఖానికి రంగు వేసుకున్నారు అంటే ఆయనలోని నటుడు ఎలా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. 


ఏదేమైనా రాజేంద్రప్రసాద్ కూతురి మరణం ఆయనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్లను పూర్తి చేయడం కోసం ఆ బాధను ఆయన దిగమింగుకొని మరీ నటిస్తున్నారు. ఇకపోతే ఈ విషయాలు విన్న కొంతమంది నెటిజన్స్ బ్రతికున్నప్పుడు మాటలేవు కానీ చనిపోయిన తర్వాత దొంగ మాటలు మాట్లాడుతున్నాడని కామెంట్లు చేయగా.. మరికొంతమంది కూతురు లేని బాధను ఎవరు తీర్చలేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.



 



Also read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.