Rajinikanth's health updates: రజనీకాంత్ అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తమిళ సూపర్ స్టార్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని, ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని కోరుకుంటూ తళైవా అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇదిలావుంటే, తాజాగా రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. రజనీకాంత్ ఆస్పత్రిలో చేరినప్పుడు ఆయన రక్తపోటులో "తీవ్రమైన హెచ్చుతగ్గులు" ఉన్నాయని.. కొన్ని గంటల్లోనే ఆయన బీపీని అదుపులోకి తీసుకొచ్చామని, ప్రస్తుతం పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ( Rajinikanth health conidtion ) నిపుణులైన వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. రజినీకాంత్ శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో ఉంటారని.. శనివారం తదుపరి వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని అపోలో ఆసుపత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


రజినీకాంత్ ఆసుపత్రిలో చేరారని ( Rajinikanth hospitalised ) సందర్శించడానికి వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదని ఆయన కుటుంబసభ్యులు, డాక్టర్స్ అభిమానులకు విజ్ఞప్తిచేశారు. అన్నాథే అనే తమిళ చిత్రం షూటింగ్ కోసం రజినీకాంత్ హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా షూటింగ్ సెట్‌లో ఉన్న సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అవడంతో తాత్కాలికంగా షూటింగ్ ఆగిపోయింది.


Also read : Rajinikanth in hospital : రజినీకాంత్‌కు అస్వస్థత, అపోలో ఆసుపత్రిలో చేరిక


రజనీకాంత్‌కు కోవిడ్ -19 వ్యాధి లక్షణాలు ( COVID-19 symptoms ) లేనప్పటికీ, ఆయన రక్తపోటులో తీవ్రమైన హెచ్చుతగ్గులు చూపించిందని, అందుకోసమే మూవీ యూనిట్ ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించాయని అపోలో హాస్పిటల్స్ శుక్రవారం ఉదయమే ఒక ప్రకటనలో వెల్లడించింది. రక్తపోటు సమస్య తప్పించి మరే ఇతర ఇబ్బందులు, లక్షణాలు రజినీకాంత్‌లో ( Rajinikanth ) కనిపించలేదని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.


Also read : Pushpa movie villain: అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా తమిళ హీరో ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook