Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్ర '‘అన్నాత్తే’'(Annathe). తెలుగులో ‘'పెద్దన్న' (Peddanna) పేరుతో విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమా దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ (Peddanna Trailer)ని విడుదల చేసింది. ఇప్పటికే పెద్దన్న మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rajinikanth: రాష్ట్రపతి, ప్రధానితో రజనీకాంత్‌


రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే యాక్షన్‌, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్‌ స్టైల్, సంభాషణలు మెప్పిస్తున్నాయి. రజనీకాంత్‌ సోదరిగా కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రజనీకి జోడీగా నయనతార (Nayanatara) మెరిసింది. మీనా, ఖుష్బూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మిస్తుంది. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శివ గత సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకోవడంతోపాటు రికార్డ్‌లను కూడా క్రియేట్ చేశాయి. దాంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు రజనీ ఫ్యాన్స్.  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook