Rajinikanth: రాష్ట్రపతి, ప్రధానితో రజనీకాంత్‌

Rajinikanth meets Modi: రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు వెళ్లి రాష్ట్ర‌ప‌తిని క‌లిశారు ర‌జినీకాంత్. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ర‌జినీకాంత్‌కు శుభాకాంక్ష‌లు చెప్పి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 05:53 PM IST
  • రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని కలిసిన సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫోటోలు
Rajinikanth: రాష్ట్రపతి, ప్రధానితో రజనీకాంత్‌

Rajinikanth meets Prime Minister Narendra Modi, President Ram Nath Kovind: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హీత, సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (Superstar Rajinikanth) ఇవాళ త‌న స‌తీమ‌ణి ల‌త‌తో క‌లిసి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను,(Ram Nath Kovind) ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని (Narendra Modi) క‌లిశారు. ముందుగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు వెళ్లి రాష్ట్ర‌ప‌తిని క‌లిశారు ర‌జినీకాంత్. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ర‌జినీకాంత్‌కు శుభాకాంక్ష‌లు చెప్పి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. తర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని నివాసానికి వెళ్లి ప్ర‌ధాని మోదీని (Modi)క‌లిశారు. ప్ర‌ధాని కూడా ర‌జినీకాంత్‌ను అభినందించారు.

ఈ రెండు సంద‌ర్భాల‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను, (Ram Nath Kovind) ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని క‌లిసి వారి ఆశీస్సులు తీసుకోవ‌డం, అభినంద‌న‌లు పొంద‌డం చాలా ఆనందంగా ఉన్న‌ద‌ని ర‌జినీకాంత్ పోస్ట్ చేశారు. 

 

Also Read : Breaking: తెలంగాణలో ఉద్భవించనున్న మరో కొత్త పొలిటికల్ పార్టీ..

న‌టుడిగా, నిర్మాత‌గా, స్క్రీన్ రైటర్‌గా సినీ రంగానికి ఆయ‌న అందించిన సేవ‌ల‌కు గుర్తింపుగా.. 67వ జాతీయ సినీ అవార్డ్స్ ఉత్స‌వాల్లో ర‌జినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) అవార్డును ప్ర‌దానం చేసిన విషయం తెలిసిందే. 

‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ (Dada Saheb Phalke) అవార్డు అందుకున్న తర్వాత రజనీకాంత్‌ని ప్రధానమంత్రి కార్యాలయానికి ఆహ్వానించిన నేపథ్యంలోనే ఆయన అక్కడికి వెళ్లారు. ఇక రజనీకాంత్‌కు (Rajinikanth)తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి కూడా తాజాగా అభినందనలు తెలియజేశారు.
Also Read : Man Donates Gold : భార్య చివరి కోరిక కోసం 17 లక్షల బంగారాన్ని ఇచ్చేశాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News