Rajinikanth's Fan Gets Strong Warning: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఎంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఎంతో సింపుల్‌గా ఉండటమే రజినీకాంత్‌కి చాలా ఇష్టం. ఆ సింప్లిసిటీనే రజినీకి మరింత మంది ఫ్యాన్స్ సొంతమయ్యేలా చేసింది. తమిళ తళైవా రజినికాంత్ చాలా కూల్ పర్సన్. ఎవ్వరినీ నొప్పించడం తెలియని మనిషి.. నేను పెద్ద స్టార్ హీరోను అనే అహంభావం లేకుండా అందరితోనూ ఎంతో సాదాసీదాగా కలిసిపోయే మనిషి. అలాంటి రజినీకాంత్ కి కూడా ఓ అభిమాని బాగా కోపం తెప్పించాడు. దీంతో ఇక తన వల్ల కావడం లేదని భావించిన రజినీకాంత్.. అతడిని కాస్తంత సున్నింతంగానే మందలిస్తూనే గట్టి వార్నింగ్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ రజినికాంత్ అభిమాని చేసిన తప్పేంటి ? ఎందుకు రజినీకాంత్‌కి ఆ అభిమానిపై అంత కోపం వచ్చింది అనే కదా మీ సందేహం.. !! అక్కడికే వస్తున్నాం. రజినికాంత్ అంటే పడిచచ్చే అభిమానులు చాలా మందే ఉంటారు అని ఇంతకు ముందే కదా చెప్పుకున్నాం.. అలా రజినీకాంత్‌ని వీర లెవెల్లో అభిమానించే వీరాభిమానులు కొంతమంది ఆయన ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్తూ ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు. అలా ఓ అభిమాని అదే పనిగా తనని అనుసరిస్తుండటం గమనించిన రజినికాంత్ చివరకు అతడికి వార్నింగ్ ఇవ్వకతప్పలేదు. అభిమానిని బాలూ అని సంబోధిస్తూ.. " ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నా వెంటపడొద్దని వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్.. వెళ్లి నీ పనిపై దృష్టిసారించు " అంటూ అభిమానికి హితవు పలికాడు.


తన అభిమాని భవిష్యత్తు గురించి ఆలోచించిన రజినికాంత్... తన వెంట పడి నీ సమయం వృధా చేసుకోవద్దని అతడిని హెచ్చరించిన తీరు అద్భుతం అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. రజినికాంత్ చెప్పిన మాటలు అతడికి తన అభిమానుల పట్ల ఉన్న సామాజిక బాధ్యత ఏ స్థాయిదో స్పష్టంచేస్తున్నాయని అభిమానులు తమ సూపర్ స్టార్ గురించి మరింత గొప్పగా చెప్పుకుంటున్నారు.


రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ఈ సూపర్ స్టార్ ప్రస్తుతం జైలర్ మూవీలో నటిస్తున్నాడు. జైలర్ మూవీలో మోహన్ లాల్ అతిధి పాత్రలో కనిపించనుండగా శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, తమన్నా భాటియా ఇతర కీలక పాత్రు పోషిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పార్ట్ అయిపోగా.. మిగతా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.


ఇది కూడా చదవండి : Actresses Martial Arts: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న హీరోయిన్స్ జాబితా


ఇది కూడా చదవండి : Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?


ఇది కూడా చదవండి : Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నప్పటికీ.. బ్యాంకు లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook