Rajinikanth: నీట మునిగిన రజనీకాంత్ ఇల్లు.. వైరల్ అవుతున్న వీడియో
Rajinikanth House: సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మనదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈయనకు పిచ్చ అభిమానులు ఉన్నారు. కాగా దాదాపు సినిమాకి రెండు వందల కోట్ల పైన రెమ్యూనరేషన్ తీసుకునే ఈ హీరో ఇల్లు మొన్న చెన్నై వరదల్లో నీట మునిగింది అనే ఒక వార్త.. అలానే ఆ వార్తకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది..
Superstar Rajinikanth: స్టైల్ అంటే ఏ భాష వారికైనా ముందుగా గుర్తొచ్చే పేరు రజినకాంత్. నటన.. స్టైల్ లో ఆయన ప్రత్యేక పేరు సంపాదించుకొని సూపర్ స్టార్ గా ఎదిగాడు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే రజినీకాంత్ కి సినిమాకి దాదాపు 200 కోట్లపైనే రెమ్యూనరేషన్ ఉంటుంది.
కాగా అంత రెమ్యూనరేషన్ తీసుకునే రజినీకాంత్ ఇల్లు మొన్న చెన్నై తుఫాను లో మునిగింది అనే వార్త తెగ వైరల్ అవుతుంది. మిగ్‌జామ్ తుపాను తమిళనాడు ముఖ్యంగా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసేసిన సంగతి తెలిసిందే. ఈ తుఫాను వల్ల రోడ్డులు, ఇల్లు వరదనీరుతో నిండిపోయి కరెంటు పోవడం, కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో జన జీవనాన్ని స్తంభించిపోయింది. కాగా ఈ వరద బీభత్సంతో కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు కోలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి ఇళ్లల్లోకి కూడా వరద నీరు చొచ్చుకొచ్చాయి. ఇక రజినీకాంత్ రజినీకాంత్ భవంతి కూడా ఈ వరదలతో నీటమునిగింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో రజినీకాంత్ అభిమాని షేర్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రజిని ఇల్లు పాదాలు లోతు వరద నీటితో కనిపిస్తుంది. కాగా ఈ మధ్య జైలర్ సినిమా విడుదలైనప్పుడు రజినీకాంత్ రెమ్యూనరేషన్ దాదాపు రెండు కోట్లు అని వినిపించిన వార్త తెలిసింది. అయితే అంత సంపాదిస్తున్న రజినీకాంత్ ఇల్లే మునిగింది అంటే…ఇక చెన్నైలో ఈ తుఫాను వల్ల సాధారణ ప్రజలు పడే బాధలు చెప్పనవసరం లేదు అని ఆ వీడియో కింద చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ‘జై భీమ్’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న తలైవర్ 170 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించడం విశేషం రెండు నిమిషాలు. ఇక ఈ సినిమాతో పాటు కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ సినిమాలో కూడా రజినీ నటిస్తున్నారు.
Also Read: New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..
Also Read: CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి