New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..

New Ministers List Telangana: తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2023, 05:35 PM IST
 New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..

New Ministers List Telangana: తెలంగాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. వేలాది మంది సమక్షంలో LB స్డేడియం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రుల ప్రమాణ స్వీకరం చేశారు. ప్రమాణ స్వీకరం జరిగిన వెంటనే ఆరు గ్యారెంటీలపై సీఎం సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజినికి రెండవ సంతకం చేశారు. ఇదే వేదికగా 11 మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. తెలంగాణ మంత్రి వర్గంలో ఏయే మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారో, వారికి సంబంధించిన పూర్తి హిస్టరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మంత్రులు వారి శాఖల వివరాలు:
మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మధిర నియోజకవర్గం నుంచి 2007 ఎమ్మెల్సీ పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా వరసగా 2009, 2014, 2019, 2023 విజయం సాధించారు. గతంలో మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ విప్‌, ఉప సభాపతి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీఎల్పీ నేతలుగా పని చేశారు. 

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి:
ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన బీఎస్సీ పూర్తి చేసి భారత వైమానిక దళంలో మాజీ ఫైటర్‌ పైలట్‌గా పని చేశారు. 1994 సంవత్సరంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరసగా 1999, 2004, 2009, 2014, 2018, 2023 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత నల్గొండ నుంచి 2009 సంవత్సరంలో ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు.       

దామోదర రాజనర్సింహ:
దామోదర రాజనర్సింహ 1989లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి వరసగా 1999, 2004,2009, 2023 పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి, ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రిగా పని చేశారు.
 
కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి:
కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి 1999 సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వెంకట్‌ రెడ్డి వరసగా 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత భువనగిరి నుంచి 2019 సంవత్సరంలో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గతంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన మంత్రిగా కూడా పని చేశారు.

దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు:
దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు 1999 సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో శ్రీధర్‌ బాబు పౌరసరఫరాలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేశారు.

పొంగులేటి  శ్రీనివాస్‌ రెడ్డి:
పొంగులేటి  శ్రీనివాస్‌ రెడ్డి 2013లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.  2014లో YSRCP రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టారు. 2014 సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2016లో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరి, 2023లో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

పొన్నం ప్రభాకర్‌:
పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 2009-14లో కరీంనగర్‌  నుంచి ఎంపీగా పని చేశారు. గతంలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

కొండా సురేఖ:
కొండా సురేఖ 1995లో మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌గా రాజకీయ అరంగేట్రం చేశారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి వరసగా  1999, 2004, 2009, 2023లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో బీఆర్‌ఎస్‌లో చేరిన ఆమె తిరిగి 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 

సీతక్క:
దనసరి అనసూయ (సీతక్క) పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1996 వరకు మావోయిస్టుగా అడవి జీవితం గడిపిన ఆమె 2004లో తెలుగుదేశం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 2009, 2019, 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. గతంలో ఏఐసీసీ కాంగ్రెస్‌ మహిళా కార్యదర్శిగా కూడా పని చేశారు. 

తుమ్మల నాగేశ్వరరావు:
తుమ్మల నాగేశ్వరరావు 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. వరసగా 1985, 1994, 1999, 2009, 2014, 2023 ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచారు. గతంలో భారీ నీటిపారుదల, చిన్న నీటిపారుదల మంత్రి, రోడ్లు, భవనాలు, మహిళా శిశు సంక్షేమం, ఆబ్కారీ శాఖ, వివిధ శాఖల్లో మంత్రిగా పని చేశారు. 2014లో బీఆర్‌ఎస్‌లో చేరి  2015లో ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. 

జూపల్లి కృష్ణారావు:
జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004, 2009, 2012, 2014 వరసగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గతంలో ఆయన ఆహార, పౌరసరఫరాల శాఖ, దేవాదాయ శాఖ మంత్రి, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News