CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి

Telangana Intelligence Chief Shivadhar Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారుల బదిలీలు ప్రారంభమయ్యాయి.  ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శిగా వి.శేషాద్రి నియమితులయ్యారు. సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 7, 2023, 06:17 PM IST
CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి

Telangana Intelligence Chief Shivadhar Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరగానే అధికారుల బదిలీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ బి.శివధర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వి.శేషాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రిగాఎ.రేవంత్‌రెడ్డి, మంత్రులుగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరండంతో ఐపీఎస్‌, ఐఏఎస్‌ల పునర్‌వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. మంత్రులకు కేటాయించే శాఖల ఆధారంగా అధికారుల నియామకం జరగనుంది. 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. తొలి సంతకం ఆరు గ్యారంటీలపై సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. ఎన్నికలకు ముందు ఆమెకు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. రేవంత్ రెడ్డితోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నూతన సచివాలయానికి చేరుకున్నారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రితోపాటు రెవెన్యూ మంత్రి శాఖ కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం మంత్రి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు  ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి పారుదల శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి  మున్సిపల్ శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు  ఆర్ అండ్ బి శాఖ, దామోదర రాజనర్శింహకు  వైద్య ఆరోగ్య శాఖ, జూపల్లి కృష్ణారావుకు  పౌర సరఫరాల శాఖ, సీతక్క గిరిజన సంక్షేమ శాఖ, కొండా సురేఖకు మహిళా సంక్షేమ శాఖలు కేటాయించారు. ఇక ప్రగతి భవన్ ప్రజా భవన్‌గా మారనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సామాన్యులు ఎవరైనా ప్రజా భవన్‌కు వచ్చి తమ సమస్యలు విన్నవించవచ్చని చెప్పారు. అందరికీ ప్రవేశం కల్పించేలా ప్రగతి భవన్‌ ముందు ఉన్న కంచెలు తొలగిస్తున్నట్లు తెలిపారు.

Also Read:  Telangana New Government: కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ఎవరెవరికి ఏయే శాఖలు

Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News