Drugs Case: ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్న నటి రకుల్
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయంపై ఎన్‌సీబీ (NCB) అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించిన నాటినుంచి డ్రగ్స్ కేసు బీ టౌన్ మొత్తాన్ని వణికిస్తోంది.
Rakul Preet Singh reaches NCB office Mumbai: బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయంపై ఎన్‌సీబీ (NCB) అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించిన నాటినుంచి డ్రగ్స్ కేసు బీ టౌన్ మొత్తాన్ని వణికిస్తోంది. ఈ కేసులో భాగంగా.. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. అయితే వారి విచారణలో డ్రగ్స్ కేసులో దీపికా పదుకునే , సారా అలీఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తోపాటు పలువురికి ఎన్‌సీబీ నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దానిలో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కొద్దిసేపటి క్రితం ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకుంది. రకుల్‌తోపాటు దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ కూడా ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చింది.
అయితే.. రియాతో డ్రగ్స్ చాటింగ్, డ్రగ్స్ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఎక్కడినుంచి ఎక్కడికి డ్రగ్స్ సరఫరా అవుతాయి.. ఇలా పలు అంశాల గురించి అధికారులు వారిని అధికారులు ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ కేసులో తనకు ఎలాంటి సమన్లు అందలేదని రకుల్ ప్రీత్ సింగ్ నిన్న ప్రకటన చేయగా.. ఎన్‌సీబీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె శనివారం ఎన్‌సీబీ అధికారుల ఎదుట హాజరు కానుంది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ ఉండటంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎవరైన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందని అంతటా చర్చ మొదలైంది. Also read: Rakul Preet Singh in drugs case: రకుల్ ప్రీత్ సింగ్‌కి NCB స్ట్రాంగ్ వార్నింగ్