ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB ) నుండి తనకు సమన్లు అందినట్టు రకుల్ ప్రీత్ సింగ్ ( Actress Rakul preet Singh ) అంగీకరించింది. రేపటి శుక్రవారం జరగనున్న విచారణ కోసం ఆమె నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగం అధికారుల ఎదుట హాజరుకానుంది. అంతకంటే ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ ప్రకటనలో స్పందిస్తూ తనకు ఇంకా సమన్లు అందలేదని పేర్కొంది. ఐతే రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఈ ప్రకటనపై NCB అధికారులు ఘాటుగా స్పందించారు. రకుల్‌కి సమన్లు జారీచేశామని.. ఆమె ఇంకా ఆ సమన్లకు స్పందించలేదని సంబంధిత విచారణ అధికారి కెపిఎస్ మల్హోత్రా ( KPS Malhotra ) తెలిపారు. రకుల్ తనకు సమన్లు రాలేదనే సాకుతో సమయం తీసుకోవాలని చూస్తోందని.. అధికారులను ఇలా తప్పుదోవ పట్టించాలని చూస్తే ఈసారి నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ( Non-Bailable Warrant ) జారీ అవుతుందని కెపిఎస్ మల్హోత్రా హెచ్చరించారు. Also read : Deepika Padukone name in Drugs case: విచారణకు సిద్ధమవుతున్న దీపికా పదుకునె
సమన్లు రాలేదని రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఆరోపణలను ఖండించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. తాజాగా మరోసారి ఆమెకు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి రకుల్ ప్రీత్ సింగ్ పీఆర్ టీమ్ స్పందిస్తూ.. రకుల్‌కి సమన్లు అందాయని, శుక్రవారం ఆమె విచారణకు హాజరవుతుందని తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ( Rhea Chakraborty ) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టిన తర్వాత ఈ కేసులో అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటికొస్తున్నాయి. బాలీవుడ్ టాలెంట్ మేనెజర్ జయ సాహ పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు ఎన్సీబీ అధికారులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. జయ సాహా వెల్లడించిన వివరాల మేరకే ఎన్సీబీ అధికారులు దీపికా పదుకునె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి హీరోయిన్స్‌కి సైతం సమన్లు జారీచేసినట్టు సమాచారం. Also read : Mumbai Drugs Case: తెరపైకి హీరో మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ పేరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe