Ram Asur Movie: పబ్లిక్ ఏరియాల్లో వాల్ పోస్టర్స్ అంటించిన హీరో, హీరోయిన్
Ram Asur Movie Hero Abhinav Sardar Heroine Chandini different promotion : తాజాగా తమ సినిమా ప్రమోషన్ కోసం గతంలో ఎన్నడూలేని విధంగా వినూత్నమైన ప్లాన్ చేశారు రామ్ అసుర్ టీమ్ (Ram Asur) హీరో అభినవ్ సర్దార్ (Abhinav Sardhar), హీరోయిన్ చాందిని (Chandini Tamilarasan) కలిసి బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ మూవీ గురించి వివరించారు. అంతేకాదు వాళ్లే వాల్ పోస్టర్స్ అంటించి కాస్త డిఫరెంట్ ప్రమోషన్స్ చేసుకున్నారు.
Ram Asur Movie Hero Abhinav Sardar Heroine Chandini different promotion for Ram Asur Movie: సినిమా ప్రమోషన్స్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు. అన్ని హంగులతో సినిమాను రూపొందించినా.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం.. సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం కూడా ఇప్పుడు ముఖ్యమే. ముఖ్యంగా చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం రకరకాల టెక్నిక్స్ యూజ్ చేస్తుంటాయి మూవీ యూనిట్స్. తాజాగా తమ సినిమా ప్రమోషన్ కోసం గతంలో ఎన్నడూలేని విధంగా వినూత్నమైన ప్లాన్ చేశారు రామ్ అసుర్ టీమ్ (Ram Asur) హీరో అభినవ్ సర్దార్ (Abhinav Sardhar), హీరోయిన్ చాందిని (Chandini Tamilarasan) కలిసి బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ మూవీ గురించి వివరించారు. అంతేకాదు వాళ్లే వాల్ పోస్టర్స్ అంటించి కాస్త డిఫరెంట్ ప్రమోషన్స్ చేసుకున్నారు.
వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్ (Abhinav Sardar), వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా కలసి నిర్మించిన పీనట్ డైమండ్ మూవీ టైటిల్‌ను.. మాస్ ఆడియన్స్‌కు రీచ్ కావాలని రామ్ అసుర్ గా మార్చారు. నవంబర్ 19న రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బెంగాల్ టైగర్ ఫేమ్ (Bengal Tiger Fame) భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై నిర్మించారు.
Also Read : OnePlus Nord 2 Pac-Man mobile: వన్‌ప్లస్ నాడ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర
ఇటీవల ఈ చిత్రంలోని పాటను హీరో సుధీర్ బాబు (Sudhir Babu) రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది. అలాగే ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ని ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు. ఇక రీసెంట్‌గా పలువురు సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఇప్పుడు రామ్ అసుర్ (Ram Asur) హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ చూపించారు.
Also Read : Nithiins Macherla Niyojakavargam : నితిన్ మాచర్ల నియోజకవర్గం నుంచి మరో అప్‌డేట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook