Ram Charan Buchi Babu Movie: ఎన్టీఆర్ వద్దనుకున్న కథను ఫైనల్ చేసిన రామ్ చరణ్?
Ram Charan Movie with Buchi babu: రామ్ చరణ్ వద్దనుకున్న సినిమాను ఎన్టీఆర్ ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఎన్టీఆర్ వద్దనుకున్న సినిమాను రామ్ చరణ్ ఒప్పుకున్నారని అంటున్నారు.
Ram Charan Accepted a Story Rejected by Jr NTR: రామ్ చరణ్ తేజ వద్దు చేయలేను అనుకున్న కథను జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే .ఈ విషయం మీద ఒకపక్క ఎన్టీఆర్ అభిమానులతో పాటు రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద వాగ్వాదం జరుగుతోంది. మా వాడు వదిలేసుకున్న కథతో మీవాడు సినిమా చేస్తున్నాడంటూ ఎన్టీఆర్ అభిమానులను రామ్ చరణ్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు.
అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు చెప్పిన కథ రామ్ చరణ్ కి చెప్పిన కథే అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు చేయించి దాన్ని ఒక కొత్త కథలాగా సిద్ధం చేయించారని అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాదనుకున్న కథను రాంచరణ్ ఓపెన్ చేశారనే వాదన తెరమీదకి తీసుకొస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు సాన డైరెక్షన్లో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాల్సి ఉంది.
కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తి అయిన తర్వాత బుచ్చిబాబు సినిమా చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే తాజాగా బుచ్చిబాబుతో తాను సినిమా చేయలేను అని ఎన్టీఆర్ తేల్చి చెప్పిన నేపథ్యంలో బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ దగ్గరికి వెళ్లి తన కథ వినిపించినట్లుగా చెబుతున్నారు. బుచ్చిబాబు రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నేపద్యంలో వారిద్దరికీ మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు చెప్పిన కథనే రామ్ చరణ్ దగ్గర తీసుకువెళ్తే ఈ కథ నాకు సూట్ అవ్వదని ఆయన సున్నితంగా తిరస్కరించారట.
దీంతో అప్పటికప్పుడే కొత్త కథను రామ్ చరణ్ కోసం నెరేట్ చేశారని, అయితే ఆ కథతో రామ్ చరణ్ సంతృప్తి చెందారని అంటున్నారు. ఇక రామ్ చరణ్ 16వ సినిమా సుకుమార్తో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బహుశా ఆ సినిమా పూర్తయిన తర్వాత బుచ్చిబాబుతో సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Nagashaurya Hospitalised: వారంలో పెళ్లనగా నాగశౌర్యకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!
Also Read: NTR Rejected: బుచ్చిబాబుకు షాకిచ్చిన ఎన్టీఆర్..అంతా అయిపోయిందనుకున్నా అక్కడే సమస్య?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook