Ram Charan welcomes Japan fans: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా.. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించిన.. రామ్ చరణ్ దశ మార్చింది మాత్రం మగధీర చిత్రం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మళ్లీ గత రెండు సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి ఏకంగా గ్లోబల్ స్టార్.. ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు.. గెటప్ రామ్ చరణ్ కు విపరీతంగా సెట్ అవ్వడంతో.. ఆయనకు అభిమానులు కూడా భారీగా పెరిగిపోయారని చెప్పవచ్చు. అప్పటినుంచి ఇతర రాష్ట్రాలకే కాదు.. ఇతర దేశాలకు వెళ్ళిన.. రామ్ చరణ్ కు జై జైలు పలుకుతున్నారు సినీ అభిమానులు.


ఇక ప్రస్తుతం.. రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుపుకుంటుండగా.. ఈసారి తప్పకుండా ఈ చిత్రం కోసం కాకుండా విడుదలవుతుంది అని మెగా అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జపాన్.. నుంచి రామ్ చరణ్ ను కలవడానికి ఆయన అభిమానులు తన ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే తన అభిమానులను తన తల్లి సురేఖతో.. కలిసి హృదయపూర్వకంగా ఇంటిలోకి ఆహ్వానించారు రామ్ చరణ్. చిరునవ్వుతో వారిని దగ్గరికి తీసుకుంటూ.. వారితో కబుర్లు పెట్టుకున్నారు.


అభిమానులతో చాలాసేపు ముచ్చటించిన.. ఆయన.. వారికి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. అంతేకాదు రిటర్న్ గిఫ్ట్ గా కొన్ని బహుమతులు కూడా అభిమానులకు.. ఇవ్వడం జరిగింది.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక స్వీట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటోంది. ఏది ఏమైనా రామ్ చరణ్ అభిమానులను..చూసి నెటిజన్స్ సైతం.. సంబరపడిపోతున్నారు. అంతేకాదు ఆయన తన అభిమానులకు ఇచ్చిన గౌరవానికి ఫిదా అవుతున్నారు.


 



 


Also read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.