Ram Charan Controversy మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇప్పుడు ప్రశాంతంగా, కూల్‌గా కనిపిస్తున్నాడు. చాలా తక్కువగా, సౌమ్యగా మాట్లాడుతున్నాడు. కానీ కెరీర్ ప్రారంభంలో మాత్రం ఎంతో దూకుడుగా ఉండేవాడు. పవన్ కళ్యాణ్‌ సైతం మొదట్లో ఇలానే ఎంతో దూకుడుగా ఉండేవాడట. అన్నయ్యను ఎవరైనా ఏమైనా అంటే వెళ్లి కొట్టేసేవాడట. అలాంటి ఆవేశమే రామ్ చరణ్‌కి సైతం వచ్చిందని నాగబాబు అంటుంటాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే రామ్ చరణ్‌ తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా కాంట్రవర్సీల్లో చిక్కుకునే వాడు. పెళ్లైన కొత్తలో రామ్ చరణ్‌, ఉపాసనలు అలా బయటకు వచ్చారు. అయితే ఇద్దరు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌లు అనుచితంగా ప్రవర్తించారట. రామ్ చరణ్ కారులోంచి దిగి కొట్టారని కొంత మంది, కాదు రామ్ చరణ్‌ సెక్యూరిటీ కొట్టారని ఇంకొంత మంది అంటారు. రామ్ చరణ్ కారు దిగి కొట్టాడంటూ ఫోటోలు కూడా ఉన్నాయని బయటకు రావడం, అవి మార్ఫ్డ్‌ ఫోటోలు అని కావాలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఓ మీడియా సంస్థ మీద కూడా రామ్ చరణ్‌ ఆరోపణలు చేశాడు. అది రామ్ చరణ్‌ కెరీర్‌లో ఓ పెద్ద కాంట్రవర్సీగా నిలిచింది.


అది కాకుండా ఇంకో సారి అంటే నాయక్ సినిమా ఈవెంట్‌లో కాస్త దురుసుగా మాట్లాడతాడు. మీడియా ఏం కావాలంటే అది రాసుకోవచ్చు.. నా బొచ్చు, వెంట్రుక కూడా పీకలేదు అన్నట్టుగా చెప్తాడు. స్టేజ్ మీద అలా యారగెంట్‌గా మాట్లాడిన చరణ్‌.. ఇప్పుడు ఎంతో సౌమ్యుడిగా మారిపోయాడు.


పెళ్లి తరువాత మెల్లిమెల్లిగా శాంతపరుడిగా మారిపోయినట్టున్నాడు రామ్ చరణ్‌. ఇప్పుడు అయితే ఎంతో పరణతితో మాట్లాడుతుంటాడు. ఎవ్వరి పట్ల ద్వేషాన్ని ప్రదర్శించడు. అందరితోనూ నవ్వుతూనే ఉంటాడు. వీలైనంత తక్కువగా మాట్లాడతాడు. ఎక్కువగా వినేందుకు ఇష్టపడతాడు. నిన్నటి వేడుకల్లో నాగబాబు చెప్పినట్టుగా రామ్ చరణ్‌ ఇప్పుడు కంప్లీట్ మెచ్యూర్డ్ పర్సన్‌గా మారిపోయాడు.


గెలుపు వస్తే పొంగిపోడు.. ఓటమి వస్తే తప్పించుకోడు.. సక్సెస్ తనది అని చెప్పుకోకపోయినా.. ఓటమి మాత్రం తనదే అని అంటాడు. వినయ విధేయ రామ టైంలోనూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రామ్ చరణ్‌.. ఫెయిల్యూర్‌ను తన మీద వేసుకుని గొప్ప మనసును చాటుకున్నాడు. ఒకప్పటి రామ్ చరణ్‌కు.. ఆర్ఆర్ఆర్, నాటు నాటు పాటతో ఆస్కార్ వరకు వెళ్లి గ్లోబర్ స్టార్‌గా మారిన రామ్ చరణ్‌కు ఎంతో తేడా ఉంది.


Also Read:  RC 15 Title : రామ్ చరణ్‌కి నిజంగానే 'గేమ్ చేంజర్'.. కథ ఏంటో చెప్పేసిన శంకర్


Also Read: Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook