Bharatheeyudu 2: అవును ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. గ్లోబల్ స్టార్ రామ్  చరణ్ చేస్తోన్న ‘గేమ్ ఛేంచర్’ భవిష్యత్తు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ పై ఆధారపడింది. ఈ సినిమా సక్సెస్, ఫెల్యూయర్స్ పైనే ‘గేమ్ ఛేంజర్’ ఫ్యూచర్ ఆధారపడింది. రామ్ చరణ్ విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో  గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆ మూవీ తర్వాత తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక దర్శకుడిగా శంకర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. రాజమౌళి కంటే ముందు తన సినిమాలతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు. అయితే.. ‘రోబో’ తర్వాత శంకర్ తెరకెక్కించిన ‘ఐ’, ‘2.O’ చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. మరోవైపు శంకర్ తన పాత సూపర్ హిట్ సినిమాలనే దుమ్ము దులిపి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో అపుడెపుడో 28 ఏళ్ల క్రితం కమల్ హాసన్ తో తెరకెక్కించిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ‘భారతీయుడు 2’సినిమాను తెరకెక్కించాడు. అప్పటి మార్కెట్ పరిస్థితులు.. కమల్  హాసన్, శంకర్ స్టార్ డమ్ వంటివి ఈ సినిమాకు కలిసొచ్చాయి. మరోవైపు అప్పటికీ ‘భారతీయుడు’ వంటి సబ్జెక్ట్ మన ఆడియన్స్ కు కూడా కొత్తగా అనిపించడంతో ఈ సినిమాను నెత్తిన పెట్టుకొని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ చేసారు.


కానీ తాజాగా మారిన పరిస్థితుల్లో కమల్ హాసన్ స్టార్ డమ్ ఏమంత బాగాలేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన ‘విక్రమ్’ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చినా.. తెలుగులో ఓ మోస్తరు విజయం సాధించింది. మరోవైపు శంకర్ మార్కెట్ కూడా ఏమంత బాగాలేదు. తాజాగా వీళ్ల కాంబినేషన్ లో వస్తోన్న ‘భారతీయుడు 2’ ట్రైలర్ ఏమంత ఇంప్రెసివ్ గా లేదు. రొటిన్ రొడ్డ కొట్టుడు మాదిరిగా ఉంది. ఇప్పటికే తెలుగు సహా ఏ భాషలో ఈ సినిమాకు సరైన బిజినెస్ జరగలేదనే టాక్ వినిపిస్తోంది.  ఈ సినిమాపై తెలుగు, తమిళం సహా ఎక్కడ పెద్దగా బజ్ లేదు. ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే కానీ.. ఈ సినిమా హిట్ కాదు. ఈ సినిమాను హిందీలో ‘హిందూస్తానీ 2’ పేరుతో విడుదల చేస్తున్నారు. అటు తమిళంలో ‘ఇండియన్ 2’ పేరుతో ఈ నెల 12న విడుదల కాబోతుంది.


ఇక ‘భారతీయుడు 2’ సక్సెస్ పైనే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంచర్’ బిజినెస్ గట్రా అన్ని ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ భారతీయుడు 2 తేడా కొడితే.. ‘గేమ్ ఛేంజర్’ బిజినెస్ పై ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే రామ్ చరణ్ అభిమానులు.. ‘భారతీయుడు 2’ హిట్ కావాలని ప్రార్థిస్తున్నారు.  ఈ సినిమా సక్సెస్ అనేది అటు శంకర్, కమల్ హాసన్ లకు కూడా కీలకమనే చెప్పాలి. ఈ సినిమా నిడివి ఎక్కువ కావడంతో భారతీయుడు 3 అంటూ మరో పార్ట్ ను రెడీ చేసి పెట్టుకున్నారు. ఒకవేళ తేడా కొడితే.. భారతీయుడు 3ను ఎవరు పట్టించుకోరనే చెప్పాలి. ఏది ఏమైనా ‘భారతీయుడు 2’ సక్సెస్ శంకర్, కమల్ హాసన్ తో పాటు రామ్ చరణ్ సహా అందరికీ కీలకం అని చెప్పాలి.


Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి