Game Changer shooting update:.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా అనగానే.. ఫ్యాన్స్ కి ఒక రేంజ్ లో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. గేమ్ చేంజెర్ అనే ఆసక్తికరమైన టైటిల్ త.. ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. అయితే రోజులు దగ్గర పడే కొద్ది.. ఈ సినిమా మీద అంచనాలు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ అయినప్పటినుంచి.. మెగా అభిమానులలో కంగారు మొదలైంది. గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంటుందో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు శంకర్.. మెగా అభిమానులకి.. మరొక పెద్ద షాక్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. 


నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది అంటూ ఒక ఫోటోని కూడా షేర్ చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కానీ శంకర్ సినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టారు. కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇవాల్టి నుంచి కొద్ది రోజులపాటు ఈ షెడ్యూల్ జరగబోతోంది. 


ప్రస్తుతం సిరిసిల్లలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇవాళ షూటింగ్ తర్వాత ఇంకొన్ని సీన్స్ షూటింగ్ హైదరాబాద్ లో కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు డైరెక్టర్ శంకర్ పై తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కి సంవత్సరాలు గడిచిపోయింది కానీ షూటింగ్ మాత్రం ఇంకా పూర్తవలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. 


ఈ గ్యాప్ లో భారతీయుడు 2 సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని.. విడుదల అయ్యి డిజాస్టర్ కూడా అయిపోయింది. ఒకపక్క సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతోంది కానీ గేమ్ చేంజర్ షూటింగ్ మాత్రం ఇంకా పూర్తవ్వలేదు. సినిమా డిసెంబర్లో విడుదల అవుతుంది అని దిల్ రాజు ఆల్రెడీ ప్రకటించేశారు. ఒకపక్క విడుదల దగ్గర పడుతున్న సమయంలో.. నిర్మాణాంతర పనులు చేయాల్సింది పోయి శంకర్ ఇంకా షూటింగ్ మాత్రమే చేస్తున్నారు అని మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Yadadri Temple: యాదాద్రికి మరింత వైభవం.. తిరుమల స్థాయిలో భారీ ప్రణాళికలు


Also Read: Corruption: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో లంచావతారం? ఇది నిజమేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook