RRR Actor Ram Charan in LA: రామ్ చరణ్‌.. ఆర్ఆర్ఆర్ మూవీకి బ్రాండ్ అంబాసిడర్ తరహాలో రామ్ చరణ్ హాలీవుడ్ చుట్టేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలు, టీవీ షోలు, సెలబ్రిటీలతో చిట్‌చాటింగ్.. ఆర్ఆర్ఆర్ మూవీతో వచ్చిన హాలీవుడ్ ఫేమ్‌ని ఎంజాయ్ చేస్తోన్న రామ్ చరణ్ ప్రస్తుత రొటీన్ ఇది. లాస్ ఏంజెల్స్‌లో ఉన్న రామ్ చరణ్ కేవలం ఆర్ఆర్ఆర్ మూవీనో లేక టాలీవుడ్‌ని రిప్రజెంట్ చేయడం లేదు. అక్కడ రామ్ చరణ్‌ని హాలీవుడ్ సెలబ్రిటీలు రిసీవ్ చేసుకుంటున్న తీరు.. మెగా పవర్ స్టార్‌ని వాళ్లు పొగడ్తల్లో ముంచెత్తుతున్న తీరు చూస్తోంటే.. రామ్ చరణ్ అమెరికాలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే రిప్రజెంట్ చేస్తోన్న ఫీల్ కలుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్ ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉందనడానికి ఉదాహరణ కూడా లేకపోలేదు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో కేటీఎల్ఏ ఎంటర్‌టైన్మెంట్ వాళ్లు నిర్వహించిన టీవీ షోలో అతిథిగా పాల్గొన్న చరణ్‌ని అక్కడున్న హోస్టులు ఇంటర్వ్యూ చేస్తూ.. రామ్ చరణ్‌ని ' బ్రాడ్‌ పిట్‌ ఆఫ్ ఇండియా ' అంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇక్కడి సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. హోస్ట్ ఇచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌కి చిరునవ్వుతోనే స్పందించిన రామ్ చరణ్.. ఐ లైక్ బ్రాడ్ పిట్ అంటూ రిప్లై ఇచ్చాడు. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ అంటే ప్రపంచం మొత్తం మెచ్చిన హీరో. అలాంటి హీరోతో చరణ్‌ని పోల్చడం నిజంగా ఎవరికైనా గర్వకారణంగానే ఉంటుంది కదా మరి. అందుకే ఇప్పుడు చరణ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. 



 


రామ్ చరణ్‌కి వచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌ని చరణ్ కన్నా ఎక్కువ అతడి అభిమానులే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్‌కి వచ్చిన ఈ కాంప్లిమెంట్స్ అతడి హార్ట్‌వర్క్‌కి, యాక్షన్‌కి, లుక్స్ అండ్ అప్పీయరెన్స్‌కి దక్కిన గౌరవంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా రామ్ చరణ్ హవానే నడుస్తోంది. ఎంతలా అంటే.. తారక్ ఇమేజ్‌ని క్రాస్ చేసేంత స్టార్‌డమ్ రామ్ చరణ్‌కి వస్తోందని.. వీలైనంత త్వరగా తారక్ పీఆర్ టీమ్ బరిలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే.. ఆర్ఆర్ఆర్ మూవీ క్రెడిట్ అంతా చరణ్ సొంతమయ్యేట్టుంది అనేంతలా రామ్ చరణ్ హైలైట్ అవుతున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇది కూడా చదవండి : Allu Arjun Bollywood Debut: షారుఖ్ ఖాన్‌కి నో చెప్పిన అల్లు అర్జున్.. కారణం అదేనా ?


ఇది కూడా చదవండి : Mahesh Babu Unhappy: త్రివిక్రమ్‌పై మహేష్ బాబు కోపంగా ఉన్నాడా ? పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్ కారణమా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook