Ram Charan HCA : టాలీవుడ్‌ హీరోలకేమైంది?.. రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా?.. కదిలిన మెగా ఫ్యామిలీ

Hollywood Critics Award For RRR రామ్ చరణ్‌ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అవుతున్నాడు. హాలీవుడ్ సైతం గ్లోబల్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్ అని కీర్తిస్తోంది. కానీ మన వాళ్లు మాత్రం రామ్ చరణ్‌కు లభిస్తున్న ఆదరణను చూసి రియాక్టే అవ్వడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 03:52 PM IST
  • హాలీవుడ్‌ అడ్డాలో రామ్ చరణ్ సందడి
  • నాలుగు అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్
  • రామ్ చరణ్‌పై బాలీవుడ్, టాలీవుడ్ జెలసీనా?
Ram Charan HCA : టాలీవుడ్‌ హీరోలకేమైంది?.. రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా?.. కదిలిన మెగా ఫ్యామిలీ

Ram Charan Gets Award At HCA రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ మెటీరియల్‌గా మారాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ప్రజెంటర్‌గా పాల్గొనేందుకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్‌కు వెళ్లాడు. అక్కడి పాపులర్ మీడియా ఏబీసీ, గుడ్ మార్నింగ్ అమెరికా వంటి షోలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి ఇండియన్ హీరోగా రామ్ చరణ్ రికార్డులు క్రియేట్ చేశాడు. అయినా ఏ ఒక్క బాలీవుడ్ హీరో గానీ, సౌత్ హీరోగానీ ప్రశంసించేందుకు ముందుకు రాలేదు.

రామ్ చరణ్‌కు దక్కుతున్న ఈ క్రేజ్, గౌరవాన్ని ఏ ఒక్కరూ గుర్తించలేకపోతోన్నారు. ఇది జెలసీ వల్ల వచ్చిన మౌనమా? లేక మనకెందుకులే అని బాలీవుడ్ నిమ్మకు నీరెత్తినట్టు ఉందా? అన్నది తెలియడం లేదు. అయితే విచిత్రంగా మన తెలుగు హీరోల్లోంచి ఏ ఒక్కర కూడా రామ్ చరణ్‌కు కంగ్రాట్స్ ట్వీట్ వేయడం లేదు.

ఇప్పుడిప్పుడు మెగా హీరోలు స్పందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్‌ తేజ్ రిప్లైలు ఇచ్చారు. రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్, రాజమౌళి మీద ప్రశంసలు కురిపించారు. అయితే అల్లు వారి నుంచి గానీ, మహేష్‌ బాబు, ప్రభాస్ వంటి వారి నుంచి గానీ ఎలాంటి రిప్లైలు రావడం లేదు.

ఇక మహేష్ బాబు అయినా స్పందిస్తాడని అంతా అనుకున్నారు. రాజమౌళితో నెక్ట్స్ మహేష్‌ బాబు సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ విధంగానైనా రామ్ చరణ్‌, ఆర్ఆర్ఆర్ మీద స్పందిస్తారని అంతా అనుకున్నారు. బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ వంటి వారి పేర్ల సరసనా రామ్ చరణ్‌ ఎన్టీఆర్ పేర్లు కూడా నామినేషన్‌లో కనిపించాయి.

కనీసం ఆ విషయాన్ని అయినా గుర్తించడం లేదని, మన టాలీవుడ్ హీరోలు గానీ, సౌత్ నుంచి గానీ బాలీవుడ్ నుంచి గానీ ఏ ఒక్కరూ  కూడా స్పందించడం లేదు. ఇలా మౌనంగా ఎందుకున్నారు.. రామ్ చరణ్ క్రేజ్‌ను చూసి ఈర్ష్య పడుతున్నారా? అంటూ రామ్ చరణ్‌ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్

Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News