Mahesh Babu Unhappy: త్రివిక్రమ్‌పై మహేష్ బాబు కోపంగా ఉన్నాడా ? పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్ కారణమా ?

Is Mahesh Babu Unhappy With Trivikram: పవన్ కళ్యాణ్‌కి త్రివిక్రమ్‌కి మధ్య మంచి అనుబంధం ఉందనేది జగమెరిగిన సత్యం. పవన్ కల్యాణ్ అంటే త్రివిక్రమ్‌కి ఒక ప్రత్యేకమైన అభిమానం. పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు డైరెక్షన్‌తో సంబంధం లేకుండా స్క్రిప్ట్, డైలాగ్స్ వంటి విభాగాల్లో తన వంతు సహాయాన్ని అందివ్వడంలోనూ త్రివిక్రమ్ ముందుంటాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 05:20 PM IST
Mahesh Babu Unhappy: త్రివిక్రమ్‌పై మహేష్ బాబు కోపంగా ఉన్నాడా ? పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్ కారణమా ?

Is Mahesh Babu Unhappy With Trivikram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం, అనుబంధం ఉంటుందో అందరికీ తెలిసిందే. అతడు సినిమా నుంచి ఖలేజా మూవీ ఔట్‌పుట్ వరకు ఆ చిత్రాలు ఆడియెన్స్‌ని ఆకట్టుకునే తీరు చూస్తేనే ఆ ఇద్దరి మధ్య ఎంత మంచి కోఆర్డినేషన్ ఉంటే ఆ సినిమాలు అంత బాగా వచ్చుంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబోలో SSMB28 మూవీ సెట్స్‌పై ఉంది. షెడ్యూల్‌కి షెడ్యూల్‌కి మధ్య గ్యాప్‌తో సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ విషయంలోనే త్రివిక్రమ్‌పై మహేష్ బాబుకు కోపం వచ్చింది అంటూ ఫిలింనగర్‌లో ఓ కొత్త టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్‌పై మహేష్ బాబు కోపానికి వాళ్లు చెబుతున్న కారణం ఏంటో తెలిస్తే ఇంకా షాక్ అనిపిస్తుంది. 

పవన్ కళ్యాణ్‌కి త్రివిక్రమ్‌కి మధ్య మంచి అనుబంధం ఉందనేది జగమెరిగిన సత్యం. పవన్ కల్యాణ్ అంటే త్రివిక్రమ్‌కి ఒక ప్రత్యేకమైన అభిమానం. పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు డైరెక్షన్‌తో సంబంధం లేకుండా స్క్రిప్ట్, డైలాగ్స్ వంటి విభాగాల్లో తన వంతు సహాయాన్ని అందివ్వడంలోనూ త్రివిక్రమ్ ముందుంటాడు. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో కొత్త సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ ఫీచర్స్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. 

అయితే, పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేసే క్రమంలో త్రివిక్రమ్ తమ SSMB28 సినిమాను ఆలస్యం చేస్తున్నాడని మహేష్ బాబు ఒకింత అసహనంతో ఉన్నాడనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. తామిద్దరం కలిసి చేస్తోన్న SSMB28 మూవీ షూటింగ్ దశలో ఉండగానే.. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టును పక్కకుపెట్టి పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కోసం సమయం కేటాయిస్తున్నాడని.. ఆ కారణంగానే తమ సినిమా ఆలస్యం అవుతుందని మహేష్ బాబు ఫీల్ అవుతున్నాడనేది ఆ ప్రచారం వెనుకున్న సారాంశం.

ఇక ఇందులో ఎంత నిజం ఉందనే విషయానికొస్తే.. మహేష్ బాబు ఫుల్ మెచ్యూర్డ్ స్టార్ యాక్టర్. రియల్ లైఫ్‌లో చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. స్పృహలో ఉండి ఆలోచిస్తారనే పేరుంది. అలాంటి సూపర్ స్టార్ అనాలోచితంగా త్రివిక్రమ్‌పై కోపం పెంచుకున్నాడని.. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సివిమా కోసం పనిచేస్తూ త్రివిక్రమ్ తన సినిమాను ఆలస్యం చేస్తున్నారని అసహనంతో ఉన్నారనే టాక్ వినిపిస్తోందంటే.. అందులో ఏ మేరకు నిజం ఉంటుందనేది ఎవరైనా ఆలోచించుకోవచ్చు. 

త్రివిక్రమ్‌పై మహేష్ బాబు అసహనం టాక్‌ని పక్కకు పెడితే.. త్వరలోనే SSMB28 మూవీ యూనిట్ నుంచి ఓ గుడ్ న్యూస్ రావొచ్చని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉగాది రోజున SSMB28 టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు ఆగ్రహంతో ఉన్నారో లేదో తెలియదు కానీ.. మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ అప్‌డేట్ కోసం ఎప్పటి నుంచో వేచిచూస్తున్న మహేష్ బాబు అభిమానులు మాత్రం కొంత అసహనంతోనే ఉన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వదులుతూ తమ డిమాండ్‌ని చెప్పకనే చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : SSMB28 Title Announcement: మహేష్ బాబు ఫాన్స్‌కి గుడ్ న్యూస్.. టైటిల్ వచ్చేస్తోంది

ఇది కూడా చదవండి : Konaseema Thugs Telugu Movie Review: కోనసీమ థగ్స్ సినిమా రివ్యూ

ఇది కూడా చదవండి : Surekha Vani Photos: అన్నం తింటున్నావా అందం తింటున్నావా.. ఎల్లోరా శిల్పంలా సురేఖా వాణి ఫోజులు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News