Ram Charan : రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ చూశారా..ఎవరున్నారంటే!
Ram Charan Upcoming Movies: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనేఉంటుంది. తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ మొబైల్ ఫోన్ లో వాల్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ వాల్ పేపర్ లో ఉన్నది ఎవరో చెప్పగలరా?
Ram Charan Mobile Wallpaper: ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అయితే తన వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు సీక్రెట్ గా ఉంచే హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. తాజాగా రామ్ చరణ్ మొబైల్ ఫోన్ వాల్ పేపర్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
రామ్ చరణ్ వాల్ పేపర్ అనగానే ఉపాసన ఫోటోనో లేక క్లీంకార ఫోటో.. ఉండి ఉంటుంది అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే రామ్ చరణ్ కుటుంబ సభ్యుల ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకోలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకి రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.
ఆ ఈవెంట్ లోనే.. రామ్ చరణ్ వాల్ పేపర్ బయటపడింది. ఇంతకీ రామ్ చరణ్ పెట్టుకున్న వాల్ పేపర్ లో ఉన్నది ఎవరంటే…మరెవరో కాదు.. హనుమంతుడు. తనకి ఎంతగానో ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి అని ఇప్పటికే రామ్ చరణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. తన ఇష్ట దైవం ఫోటోనే చెర్రీ వాల్ పేపర్ గా కూడా పెట్టుకున్నారు.
ఇక సినిమాల పరంగా చూస్తే రామ్ చరణ్ చేతిలో ఇప్పుడు బోలెడు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్, కియారా కాంబోలో రాబోతున్న రెండవ సినిమా ఇది.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. RC16 అని వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఒప్పుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. గతంలో రామ్ చరణ్ సుక్కు కాంబోలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాబట్టి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
Also read: Loksabha polls 2024: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..
Also Read: Chiranjeevi: పవన్‌కల్యాణ్ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter