Ram Charan Off To Los Angeles రామ్ చరణ్‌ పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్‌గా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ హాలీవుడ్ మెటీరియల్ అన్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్రను అద్భుతంగా పోషించిన రామ్ చరణ్‌.. హాలీవుడ్ డైరెక్టర్లను, యాక్టర్లను, క్రిటిక్స్ సైతం ఆశ్చర్యపరిచాడు. జేమ్స్ కామెరూన్ అంతటి వాడే రామ రాజు పాత్రను పోషించిన తీరు, మలిచిన తీరు గురించి పొగిడేశాడు. రామ్ చరణ్‌ నటన జేమ్స్ కామెరూన్‌ను ఎంతలా కట్టి పడేసి ఉండకపోతే ఆ పాత్ర గురించి అంతలా చెప్పి ఉంటాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా రామ్ చరణ్‌ తన నటనతో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ దక్కించుకున్నాడు. తెరపై రామ్ చరణ్‌ అలా ఉంటే.. తెర వెనుక ఎంత హంబుల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అభిమానులను ఎంత ప్రేమగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా కొంత మంది ఫ్యాన్స్‌ను రామ్ చరణ్‌ కలిశాడు. ఓ బుడ్డోడు ఇంట్లో చెప్పకుండా వచ్చాడని తెలుసుకుని రామ్ చరణ్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. ఆ పిల్లాడిని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేశాడు.


 



అలా రామ్ చరణ్‌ ఎప్పుడూ తన అభిమానుల మీద ప్రేమను కురిపిస్తూనే ఉంటాడు. ఇక రామ్ చరణ్‌ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌కు పయణం అయ్యాడు. నేటి ఉదయం రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ వద్ద కనిపించాడు. రామ్ చరణ్‌ ఇప్పుడు అయ్యప్పమాలలో ఉన్నాడని తెలిసిందే. అందుకే ఆయన కాలికి చెప్పులు లేకుండా అలానే తిరిగేస్తున్నాడు. ఇక ఎయిర్ పోర్టులోనూ అలానే వచ్చేసరికి అక్కడ ఉన్నవారంతా చూసి ఆశ్చర్యపోయారు. 


రామ్ చరణ్‌ భక్తి, దీక్ష, అంకితభావం చూసి జనాలంతా ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్‌ భక్తిని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్‌ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చే అవార్డుల కోసం లాస్ ఏంజిల్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఇక ఆస్కార్ నామినేషన్‌లోనూ నాటు నాటు ఉంది. ఆస్కార్ అవార్డు కూడా నాటు నాటు సాంగ్‌కు వస్తుందని అంతా భావిస్తున్నారు.


Also Read:  Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్


Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook