Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..
Game Changer: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదిన రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో జరుగుతుంది.
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’.. దాదాపు ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ అదే రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికే తెలుగు సహా పలు దక్షిణాది భాషలకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. మరోవైపు నార్త్ ఇండియాలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ హక్కులను కరణ్ జోహార్ కు సంబంధించిన ఏఏ మూవీస్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా టీజర్ ను ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే యూపీలోని యోగి గవర్నమెంట్ అక్కడ సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించే పలు చర్యలు చేపట్టింది. ఓ ఫిల్మ్ సిటీ కూడా నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ప్యాన్ ఇండియా చిత్రం టీజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ నిర్వహించడం అక్కడ మొదటి సారి.
తాజాగా మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ శాటిలైట్, ఓటీటీ బిజినెస్ కూడా పూర్తైయినట్టు సమాచారం. శాటిలైట్ అన్ని భాషలకు కలిపి రూ. 70 కోట్లు.. ఓటీటీ కూడా దాదాపు రూ. 80 కోట్లు.. ఆడియో రైట్స్.. రూ. 30 కోట్లు.. వరకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఓ రకంగా నాన్ థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 180 కోట్ల టేబుల్ ప్రాఫిట్స్ సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో రామ్ చరణ్.. నిజాయితీగా గల ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు అణగారిన వర్గాల తరుపున పోరాడే ప్రభుత్వాధినేతగా ఎలా ఎదిగాడనేది ఈ మూవీ స్టోరీ. ఇందులో రామ్ చరణ్.. ఫస్ట్ టైమ్ ఫాదర్ అండ్ సన్ గా డ్యూయల్ రోల్లో మెప్పించనున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటించారు. మొత్తంగా ఈ చిత్రాన్ని ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఉండబోతున్నట్టు టాక్. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. గతంలో సంక్రాంతి సీజన్ లో విడుదలైన రామ్ చరణ్ చిత్రాలైన ‘నాయక్’, ‘ఎవడు’ చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసాయి. ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ గా నిలిచింది. ఇపుడు నాల్గోసారి సంక్రాంతి పోటీలో సై అంటూ ముందుగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు.
ఈ చిత్రాన్నిహైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చండీగఢ్, న్యూజిలాండ్ లలో చిత్రీకరించారు. దేశ, విదేశాల్లో షూట్ చేసిన "గేమ్ ఛేంజర్" విజువల్ వండర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. శంకర్ తొలిసారి తెలుగులో డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.