Ram Charan shelved RC 16 Because of Script Differences with Gowtam Tinnanuri: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. అయితే ఆచార్య సినిమా నుంచి ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలిని సహా మరి కొందరు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ తేజ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. తెలుగులో మళ్లీ రావా సినిమాతో దర్శకుడిగా పరిచయమై హిట్ అందుకున్న ఆయన నాని హీరోగా జెర్సీ సినిమాతో హిట్ అందుకున్నారు. అదే జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేసిన ఆయన హిందీలో మాత్రం హిట్ అందుకోలేకపోయారు.


అయితే రామ్ చరణ్ తో గౌతమ్ రామ్ చరణ్ 16వ సినిమా చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక రామ్ చరణ్ తో గౌతమ్ చేయాల్సిన సినిమా ప్రస్తుతానికి నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. గౌతం తిన్ననూరి రాంచరణ్ ను తన ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో మెప్పించలేకపోయారని, దీంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని తెలుస్తోంది.. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ మెగా ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


నచ్చని స్క్రిప్టులు పక్కన పెట్టినప్పుడే మళ్లీ మళ్లీ ఫ్లాప్స్ అందుకోకుండా ఉంటారని మొహమాటం కొద్దీ సినిమాలు చేస్తే ఇప్పుడున్న పోటీలో టాప్ లో నిలబడటం కష్టమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గౌతం తిన్ననూరి స్క్రిప్ట్ పక్కన పెట్టిన రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడు అనే విషయం మీద ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సహనటుడు ఎన్టీఆర్ ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా లైన్లో పెట్టారు. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా రూపొందే అవకాశం ఉంది. 
Also Read: New Villian in Pushpa the Rule: పుష్ప 2 కోసం సుకుమార్ నయా ప్లాన్.. రంగంలోకి పవర్ ఫుల్ విలన్!


Also Read: Liger Movie 5 Days Collections: ఐదో రోజు 80% డ్రాప్.. తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా పరుగులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి