RC 17 -Ram Charan - Sukumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న నటుడిగా పెద్ద పేరైతే రాలేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా డాన్స్, ఫైట్స్‌లలో ఈజ్ చూపించాడు కానీ.. ముఖంలో ఎక్స్‌ప్రెషెన్ పలకించలేడని క్రిటిక్స్ నుంచి విమర్శలు అందుకున్నాడు రామ్ చరణ్. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో రామ్ చరణ్ యాక్ట్ చేసినా..  అందులో పెద్దగా యాక్టింగ్‌కు స్కోప్ ఉండేది కాదు. నాలుగు డాన్సు స్టెప్పులు.. మూడు ఫైట్స్ అంటూ ఓ ఫార్ములా ప్రకారం సినిమాలు చేసేవాడు. ఇలాంటి టైమ్‌లో  వాటన్నిటికీ చెక్ చెబుతూ సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' మూవీతో రామ్ చరణ్‌ కెరీర్‌ను పూర్తిగా ఛేంజ్ చేసింది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్.. పూర్తిగా మారిపోయింది. రామ్ చరణ్‌లోని యాక్టింగ్ స్కిల్స్ ఏంటో అందరికీ తెలిసొచ్చేలా ఈ సినిమాలో అద్భుత నటనను అతన్ని నుంచి సుకుమార్ రాబట్టుకున్నాడు.   అంతేకాదు ఈ సినిమాలోని నటనతో తిట్టి విమర్శకుల నోళ్లతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర రూ. 125 కోట్ల షేర్.. రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా తనకు నటుడిగా పెద్ద పేరు తీసుకొచ్చిన రంగస్థలం సినిమా దర్శకుడు సుకుమార్‌తో రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నట్టు హోళి పండగ సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. అంటే రామ్ చరణ్ అభిమానులకు మాత్రం రెండు రోజులు ముందు బర్త్ డే గిఫ్ట్‌గా భావిస్తున్నారు అభిమానులు. ఇప్పటికే రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను సుకుమార్ పూర్తి చేసినట్టు సమాచారం. ఈ యేడాది చివరి వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగనుంది. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కూడా రంగస్థలం మాదిరే రామ్ చరణ్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.




ఆర్ఆర్ఆర్ త‌ర్వాత గ్లోబ‌ల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు రామ్‌చ‌ర‌ణ్‌. ఇటు పుష్ప సినిమాతో త‌గ్గేదేలే అంటూ అంద‌రివాడ‌నిపించుకున్నారు లెక్కల మాస్ట‌ర్ సుకుమార్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మీద మ‌న ద‌గ్గ‌రే కాదు, దేశ వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి.వాట‌న్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు సుకుమార్‌. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొద‌లుపెడ‌తారు. 2025 లాస్ట్ క్వార్ట‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్‌కి రాక్‌స్టార్‌, మ్యూజిక్ సెన్సేష‌న్ దేవిశ్రీ ప్ర‌సాద్ పేరు తోడ‌వ‌డం అభిమానుల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది. రంగ‌స్థ‌లం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్ మ‌రోసారి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో రెడీ అవుతోంది.


మరోవైపు రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌తో పాటు రిలీజ్ డేట్  కూడా ఈ నెల 27న రామ్ చరణ్  ప్రకటించనున్నారు. మరోవైపు బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేస్తోన్న సినిమా టైటిల్‌ను కూడా అదే రోజు రివీల్ చేయనున్నట్టు సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కథలో కీలకమైన పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించనున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.


Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook