Ram Charan to act in Salman Khan's Movie: మెగా ఫ్యామిలీకి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. సల్మాన్, చిరంజీవిది ప్రత్యేక అనుబంధం కాబట్టి  కండల వీరుడు ఎప్పుడు హైద్రాబాద్‌కు వచ్చినా మెగాస్టార్ ఇంటికి వెళ్తుంటాడు. ఇక పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం సల్మాన్ అంటే ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తాడు. సల్మాన్ సైతం చరణ్ పట్ల అమితమైన అభిమానాన్ని చూపిస్తుంటాడు. ఇరువురు తమతమ సినిమాలకు సాయం చేసుకుంటూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సల్మాన్ ఖాన్ సినిమాలను తెలుగులో రామ్ చరణ్ ప్రమోట్ చేస్తుంటాడు. అంతేకాదు డబ్బింగ్ కూడా చెబుతుంటాడు. అలా మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ రిలేషన్ ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది. అందుకే చిరంజీవి అడిగిన వెంటనే రూపాయి కూడా తీసుకోకుండా.. 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్లూ భాయ్ నటించేందుకు ఒప్పుకున్నాడట. సల్మాన్‌కు అనుకూలంగా ఉన్న తేదీలను బట్టే ఆ షూట్ చేయాలని చిరు కూడా చెప్పాడట. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు సార్లు హైద్రాబాద్‌కు వచ్చాడు సల్మాన్. తన సినిమా షూటింగ్‌లు కూడా ఇక్కడ చేస్తుంటాడు సల్లూ భాయ్. 


ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమా గ్రాఫ్, వాటి కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. దబాంగ్ 3, రాధే, ఆంటిమ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఎలాగైనా హిట్టు కొట్టాలని 'కభీ ఈద్ కభీ దివాలీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో సల్లూ భాయ్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం సల్మాన్ హైద్రాబాద్‌కు వచ్చాడు. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేశారట. అందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని సల్మాన్ అభిప్రాయపడ్డారట. అదే విషయాన్ని చరణ్‌ను అడిగితే.. ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 


ఈ పాటలో రామ్ చరణ్‌తో పాటుగా విక్టరీ వెంకటేష్ కూడా కనిపించనున్నట్టు సమాచారం తెలుస్తోంది. అయితే చరణ్ కేవలం పాటలో మాత్రమే కనిపిస్తారని కొందరు అంటుంటే.. ఓ చిన్న రోల్ కూడా చేస్తున్నాడని ఇంకొందరు అంటున్నారు. అయితే సల్మాన్ ఖాన్ కోసం చరణ్‌ స్పెషల్ సాంగ్ చేస్తున్నాడా లేదా స్పెషల్ కారెక్టర్ చేస్తున్నాడా అనే విషయం తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకు పర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహిస్తుండగా.. పూజా హెగ్డే కథానాయిక. ఇక చరణ్ ఇప్పుడు శంకర్ సినిమా షూటింగ్‌తో బిజీ కానున్నాడు. RC 15 కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. 


Also Read: Virat Kohli: పదేళ్ల నాటి ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ ఎందుకవుతుంది, కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు


Also Read: Shahid Afridi BCCI: బీసీసీఐ ఏం చెబితే.. క్రికెట్‌ ప్రపంచంలో అదే జరుగుతుంది! షాహిద్‌ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook