Ram Charan - Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగవ సీజన్ కూడా మొదలు కాబోతోంది. అక్టోబర్ 25వ తేదీన చాలా గ్రాండ్ గా అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ ప్రారంభం కాబోతోంది. ఈ మొదటి రోజు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపోతే ఈరోజు రాత్రి మొదటి ఎపిసోడ్ కి సీఎం చంద్రబాబు నాయుడుతో స్ట్రీమింగ్ కానుంది. అటు నందమూరి అభిమానులు,  ఇటు టిడిపి కార్యకర్తలు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ అన్ స్టాపబుల్ షో పలు ఎపిసోడ్స్ కి  షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. అల్లు అర్జున్, నాగార్జున,  సూర్య వంటి హీరోలకు సంబంధించి ఎపిసోడ్స్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. 


ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..  రామ్ చరణ్ కూడా ఈ అన్ స్టాపబుల్ షోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. రామ్ చరణ్ కూడా ఈ అన్ స్టాపబుల్ షో కి హాజరు కాబోతున్నారట. గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్,  నిర్మాత దిల్ రాజు ఈ షో కి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


డిసెంబర్ లో విడుదల కావలసిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో జనవరి 10వ తేదీన వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్యతో రామ్ చరణ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసి విడుదలకు ముందు ఈ ఎపిసోడ్ ని వదులుతారని సమాచారం.  గతంలో కూడా ప్రభాస్ వచ్చినప్పుడు చరణ్ కి కాల్ చేసి బాలకృష్ణ మాట్లాడిన విషయం తెలిసిందే.  బయట కూడా రామ్ చరణ్ తో  బాలయ్య చాలా సన్నిహితంగా ఉంటారు


ఇక ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం మెగా , నందమూరి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టారని తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


 


Read more: Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter