Naraka chathurdashi 2024: నరక చతుర్దశి ఎప్పుడు? ఇంట్లో ఆకస్మిక మరణాల సంభవించకుండా యమ దీపం ఏ సమయంలో వెలిగించాలి?

Naraka chathurdashi 2024: దీపావళి ఈ నెల అక్టోబర్‌ 31వ తేదీన రానుంది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాధిలో నవంబర్‌ 1వ తేదీనా కూడా జరుపుకుంటారు. అయితే, నరక చతుర్దశి కూడా అక్టోబర్ 31వ తేదీన రానుంది. ఈరోజు ఏం చేయాలి తెలుసుకుందాం
 

1 /6

దీపావళికి ముందు వచ్చే రోజున చతుర్దశి రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. ఈ ఏడాది 2024 అక్టోబర్‌ 30 బుధవారం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 31 గురువారం మధ్యాహ్నం 2:49 నిమిషాల వరకు ఉంటుంది.  

2 /6

అయితే, అక్టోబర్‌ 31వ తేదీనే నరక చతుర్దశి జరుపుకోనున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం లేవగానే తైల అభ్యంగన స్నానం చేయాలి.  

3 /6

ఈరోజు సాయంత్రం సమయంలో ఉల్కా ప్రదర్శనం కూడా చేస్తారు. పెత్తర అమావాస్య సమయంలో భూలోకానికి వచ్చిన పెద్దలు ఈ అమావాస్య ముందు వారు పితృలోకానికి ప్రయాణిస్తారు.అందుకే ఆకాశంపై పు చూస్తూ దీపం చూపిస్తే వారి మార్గానికి సుగమం అవుతుంది అని నమ్ముతారు. ఆకాశ దీపాలు కూడా వెలిగిస్తారు.  

4 /6

నరక చతుర్దశి రోజు యమదీపం వెలిగిస్తారు. ఈదీపం వల్ల ఇంట్లో ఆకస్మిక మరణాలు సంభవించకుండా ఉంటాయి. మెయిన్‌ డోర్‌ బయటవైపు గడప వద్ద రెండు దివ్వెలు తీసుకుని పసుపు కుంకుమ పూలు పెట్టి దీపం వెలిగించాలి. దీన్ని దక్షిణం వైపు పెట్టుకోవాలి.

5 /6

రెండు చొప్పున ఆరు వత్తులు మూడు దిక్కుల పెట్టి వెలిగించాలి. బెల్ల నైవేద్యంగా పెట్టాలి. ఈ దీపాన్ని కొంతమంది ఐదురోజులు, కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపాలు వెలిగిస్తారు. అప్పుడు ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు.  

6 /6

భాద్రపద మాసంలో మన పితృదేవతలు భూలోకం చేరుకుని తిరిగి ఈ రోజుల్లో తిరిగి పితృలోకానికి వెళ్తారు.అందుకే వారి కోసం వెలిగిస్తారు. అక్టోబర్‌ 30వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాల నుంచి రాత్రి 7:20 వరకు యమదీపం వెలిగించడానికి సరైన సమయం.