తండ్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున, సైరా నర్సింహా రెడ్డి చిత్ర నిర్మాత హోదాలో ఆ సినిమా టీజర్ ని విడుదల చేసి మెగాస్టార్ అభిమానులను మెగా గిఫ్ట్ అందించాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులకు పవన్ కల్యాణ్ బర్త్ డే రోజున మరో గిఫ్ట్ ఇచ్చేందుకు చెర్రీ రెడీ అవుతున్నాడట. అవును, తాజాగా టాలీవుడ్ సినీవర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే కానుకగా తాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న అప్ కమింగ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. లోలోపల అందుకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం జరిగిపోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. 


బోయపాటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చెర్రీ సరసన భరత్ అనే నేను బ్యూటీ కియారా అడ్వాణి జంటగా నటిస్తోంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చెర్రీ చేస్తోన్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.