Ram Charan looking at Ravi Teja for Driving licence Telugu remake: రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ విషయంలో తన ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఆ తర్వాత సైరా నర్సింహా రెడ్డి, ఆచార్య వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. మూడు చిత్రాలు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే చేసిన రామ్ చరణ్.. మొదటిసారిగా ఫర్ ఏ చేంజ్ ఇటీవలే డ్రైవింగ్ లైసెన్స్ అనే ఓ మళయాళం సినిమాకు సంబంధించిన తెలుగు రీమేక్ రైట్స్ (Driving licence Telugu remake rights) కొనుగోలు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ మూవీలో (Driving licence malayalam movie) పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని అనుకున్న రామ్ చరణ్.. మళయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రకు తన బాబాయి పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందని మొదట భావించినట్టు ఫిలింనగర్ టాక్.


ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అయితే బాగుంటుంది అని అనుకున్న పాత్ర స్థానంలో రవితేజను తీసుకోవాలని డిసైడ్ అయినట్టు లేటెస్ట్ టాక్. ఆ పాత్ర కోసం మెగా హీరోలు ఎవ్వరూ సూట్ కారని భావించిన రామ్ చరణ్.. స్టార్ ఇమేజ్ ఉన్న మరో హీరోకే ఆ రోల్ ఆఫర్ చేయాలనుకున్నాడట. అలా ఆ పాత్ర చివరకు రవితేజ చేతికి చిక్కినట్టు సమాచారం. 


మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన రవితేజ (Ravi Teja).. అన్నయ్య సొంత ప్రొడక్షన్ హౌజ్ తెరకెక్కించే సినిమాలో నటించే అవకాశం వస్తే నో చెబుతాడా ? పైగా డ్రైవింగ్ లైసెన్స్ మూవీ నేపథ్యం కూడా మంచి కామెడీ డ్రామాతో తెరకెక్కిన సినిమా. అందుకే ఆ పాత్రకు మాస్ మహారాజ రవితేజ అయితేనే సూట్ అవుతాడని రామ్ చరణ్ (Ram Charan) కూడా భావించి ఉండొచ్చు.