Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాతీయజెండాను అవమానించారంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హ్యాపీ మెుబైల్స్ అనే సంస్థకు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. స్వాత్యంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సదరు సంస్థ పేపర్ ప్రకటన ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఇందులో రామ్ చరణ్(Ramcharan) జాతీయ జెండా(National Flag) పట్టుకొని సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నప్పటీకీ.. ఆ జాతీయ జెండాలో అశోక చక్రం లేకపోవడం అందరి కంట పడింది.దీంతో అగ్రహించిన నెటిజన్లు జాతీయ పతాకాన్ని అవమానించారంటూ...విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.


Also Read: Evaru Meelo Koteeswarulu: తారక్ వచ్చేస్తున్నాడు...గెస్ట్ ఎవరో తెలుసా?


2002 జాతీయ జెండా చట్టం(National Flag Act 2002) ప్రకారం, అశోక చక్రం లేకుండా జాతీయ పతాకాన్ని  ప్రదర్శించడం అనేది ఓ నేరం. దీంతో ఈ ఇష్యూ చర్చల్లో నిలిచింది. చెర్రీ(Ram Charan)పై ట్రోలింగ్ ఊపందుకోవడంతో సంస్థ నిర్వాహకులు రంగంలోకి దిగి..వివరణ ఇచ్చారు. వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను ఉపయోగించకూడదు. ‘యాడ్స్ ఇచ్చేటప్పుడు జాతీయ జెండాలా ఉండే త్రివర్ణ పతాకాన్ని మాత్రమే వాడాలి. అందుకే అశోక చక్రం(Ashoka Chakram) వాడాం’’ అంటూ సదరు సంస్థ క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికైనా ఈ వివాదం సద్దుమణిగుతుందో లేదో వేచి చూడాలి.


చెర్రీ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్(RRR)లో నటిస్తున్నాడు. దీంతోపాటు తండ్రి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో కలిసి ఆచార్య(Acharya)లో కనిపించనున్నాడు. మరో వైపు చరణ్ శంకర్(Director Shanker) దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. సెప్టెంబరు 2 పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook