Ram Charan Trujet : రామ్ చరణ్ విమానయాన రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల క్రితం ట్రూజెట్‌లో పెట్టుబడులు పెట్టాడు రామ్ చరణ్. ట్రూ జెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయాడు. అయితే ట్రూ జెట్ మీద వచ్చినన్నీ ఫిర్యాదులు మరేసంస్థ మీద కూడా రాలేదు. సర్వీసుల, ఆలస్యం ఇలా ప్రతీ ఒక్క విషయంలో వాటి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ట్రూ జెట్ నష్టాల్లో నడుస్తోందని అప్పట్లోనే టాక్ వచ్చింది. అయితే రామ్ చరణ్ కూడా ట్రూ జెట్ నుంచి తప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా మళ్లీ ఇప్పుడు ట్రూ జెట్ మీద చర్చలు జరుగుతున్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన ట్రూజెట్‌పై (టర్బో మేఘా ఎయిర్‌వేస్‌) ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌లో దివాలా పిటిషన్‌ దాఖలైందని తెలుస్తోంది.  విమానాలను లీజుకు ఇచ్చిన డే లీజింగ్‌ (ఐర్లాండ్‌) 8 లిమిటెడ్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్టు సమాచారం.


అప్పుల్లో కూరుకుపోవడంతో కొద్ది నెలల కిత్రం ట్రూజెట్‌ సేవలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. లీజు, రెంటల్స్‌ కింద విమాన లీజర్లకు టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ దాదాపు రూ.35 కోట్లు బకాయి పడిందట. దీంతో విమానాలను అద్దెకు ఇచ్చిన కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిందట.


కాగా ట్రూజెట్‌లో 79 శాతం వాటాను రూ.200 కోట్లకు సొంతం చేసుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో విన్‌ఎయిర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ట్రూజెట్‌ మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించగలదని గతంలో విన్‌ఎయిర్‌ పేర్కొంది. అయితే ట్రూజెట్‌లోంచి రామ్ చరణ్ బయటకు వచ్చేశాడా? ఇంకా కొనసాగుతున్నాడా? అన్నది క్లారిటీ లేదు. కానీ ట్రూ జెట్ అంటే మాత్రం రామ్ చరణ్ గుర్తుకు వస్తాడు.


Also Read : Samantha : నువ్ ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు!.. సమంత ఉద్దేశ్యం ఏంటి?


Also Read : Allu Aravind on Chiranjeevi: చిరుతో వివాదాలపై పెదవి విప్పిన అరవింద్..అసలు విషయం బయట పెట్టేశాడుగా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook