Ram Charan - upasana konidela : రామ్ చరణ్‌ ఉపాసన ఇద్దరూ బయట ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇద్దరూ ప్రైవేట్ పార్టీలు అయినా, ఫ్యామిలీ ఈవెంట్లలో అయినా జంటగా కనిపిస్తుంటారు. అయితే తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో సందడి చేశారు.  అయితే ఇందులో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మామూలుగా అయితే ఇద్దరిద్దరూ కూర్చునేందుకు స్పెషల్ సీటింగ్ అరేంజ్ చేస్తుంటారు. ముగ్గురు కూర్చునేది కూడా ఉంటుంది. ముందు రామ్ చరణ్ ఉపాసన కలిసి ఒకే దగ్గర కూర్చున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తరువాత సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చి చేరినట్టున్నాడు. ఈ ముగ్గురూ ఒకే సోఫాలో కూర్చోవడంతో అసలు సమస్య వచ్చింది. రామ్ చరణ్‌ కాస్త అన్ కంఫర్ట్‌గా కూర్చున్నట్టున్నాడు. దీంతో ఉపాసనను పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. పక్కనే రామ్ చరణ్ తల్లి సురేఖ కూర్చుని ఉన్నారు. అయితే పక్కకు వెళ్లు.. అమ్మ దగ్గర కూర్చో అని చెప్పినట్టున్నాడు రామ్ చరణ్. దీంతో ఉపాసన మొహం ఒక్కసారిగా మారిపోయింది.


కాస్త కోపంగా చూస్తూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. పక్కనే ఉన్న సురేఖ పక్కన.. ఉపాసన కూర్చుంది. చరణ్‌ను చూసి నవ్వేసింది. ఇక రామ్ చరణ్ అయితే ఉపాసన వెళ్లిపోవడంతో.. ఎంతో ఫ్రీగా కూర్చున్నాడు. ఇదంతా చూస్తున్న సాయి ధరమ్ తేజ ముసి ముసి నవ్వులు నవ్వేశాడు. చివరకు రామ్ చరణ్‌, సాయి ధరమ్ తేజ్ హాయిగా కూర్చున్నారు.


 



ప్రస్తుతం రామ్ చరణ్‌, ఉపాసనలకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాలో రామ్ చరణ్ ఓ షాట్లో కనిపించబోతోన్నట్టు కనిపిస్తోంది. తన తాత అల్లు రామలింగయ్య గురించి రామ్ చరణ్‌ వేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.


ఈ ఈవెంట్లో చిరు స్పీచుకు అందరూ పగలబడి నవ్వేసిన సంగతి తెలిసిందే, తన పెళ్లి ముచ్చట్లు చెబుతూ నాటీ కామెంట్లు చేశాడు. తన మామగారితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు. స్టేజ్ మీద చిరు ప్రసంగం ఇస్తున్నంత సేపు అందరూ నవ్వుతూనే కనిపించారు. తనకు పెళ్లి ఎలా జరిగింది.. ఎలా కుట్ర పన్ని చేశారంటూ చమత్కరిస్తూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. అందరినీ నవ్వించేశాడు.


Also Read : kriti sanon-prabhas : వీరి ప్రేమకు నిదర్శనమిదేనా?.. ప్రభాస్ కృతి సనన్ క్యూట్ వీడియో


Also Read : త్రివిక్రమ్‌ని తిట్టింది నేనే.. వాయిస్ నాదే : బండ్ల గణేష్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook