kriti sanon-prabhas : ప్రభాస్‌కు చెమటలు.. తుడుచుకునేందుకు కొంగును ఇచ్చిన కృతి సనన్.. వీడియో వైరల్

adipurush teaser launch event ఆదిపురుష్‌ టీజర్ లాంచ్ ఈవెంట్లో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభాస్ కృతి సనన్ మధ్య ఉన్న క్యూట్ బాండ్ బయటకు వచ్చేసింది. ఈవెంట్లో ఈ ఇద్దరి చూపులు, మాటలు, చేష్టలు అందరికీ అనుమానాలు కలిగించేలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2022, 11:21 AM IST
  • ఆదిపురుష్‌ టీజర్ లాంచ్ ఈవెంట్
  • ప్రభాస్ కృతి సనన్ క్యూట్ బాండింగ్
  • కొంగుని ఇవ్వబోయిన కృతి సనన్
kriti sanon-prabhas : ప్రభాస్‌కు చెమటలు.. తుడుచుకునేందుకు కొంగును ఇచ్చిన కృతి సనన్.. వీడియో వైరల్

kriti sanon-prabhas : ప్రభాస్ కృతి సనన్ మీద గత కొన్ని రోజులుగా ఎలాంటి వార్తలు వస్తున్నాయో అందరికీ తెలిసిందే. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే ఆ సమయంలో మన డార్లింగ్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన బాధలో ఉన్నాడు. అలా ప్రభాస్ బాధలో ఉంటే.. నేషనల్ మీడియా మాత్రం అలాంటి పిచ్చి కథనాలు రాసేసింది. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో అలాంటి వార్తలు రాస్తారా? అంటూ మండిపడ్డారు. అయితే ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ చూస్తే.. వాళ్లు రాసిందే నిజమయ్యేలా ఉందనిపిస్తోంది.

ఆదిపురుష్‌  టీజర్ లాంచ్ ఈవెంట్లో చాలా చోట్ల ప్రభాస్ కృతి సనన్ బంధానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చోటు చేసుకున్నాయి. ప్రభాస్ కృతి ఇద్దరి చూపులు కూడా కాస్త తేడాగానే అనిపించాయి. జ్యోతి ప్రజ్వలన చేసే సమయంలోనే కృతి చూపులు, చేష్టలు వింతగానే ఉన్నాయి. ప్రభాస్ తన చెప్పులు విడిచి.. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వస్తాడు. కాస్త లేటుగానే వస్తాడు. కానీ ప్రభాస్‌ను త్వరగా రమ్మన్నట్టుగా కృతి పిలుస్తుంది. ప్రభాస్ వచ్చాక.. జ్యోతిని వెలిగించమని అంటుంది.

అయితే ఓం రౌత్ చేతిని పట్టుకుని ప్రభాస్ జ్యోతిని వెలిగిస్తాడు. దీంతో కృతి కూడా.. ప్రభాస్ చేతినే పట్టుకుంటుంది. జ్యోతిని వెలిగించిన తరువాత.. ప్రభాస్ మళ్లీ తన చెప్పులు వేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కృతి తన చేతిని సాయంగా ఇస్తుంది. కృతి చేతిని పట్టుకుని ప్రభాస్ తన చెప్పులు వేసుకుంటాడు. ఇలా చాలా చోట్ల ఈ ఇద్దరి బంధానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చోటు చేసుకున్నాయి.

 

మరో చోట ప్రభాస్ తనకు చెమటలు పడుతుంటే ఇబ్బందిపడ్డాడు. అది చూసిన కృతి.. తన కొంగును ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ప్రభాస్ మాత్రం తన చేత్తోనే తుడుచుకున్నాడు. దీంతో కృతి కాస్త ముసి ముసి నవ్వులు నవ్వేస్తుంది. ఇలా చాలా చోట్ల ఈ ఇద్దరూ ప్రేమికుల్లానే అనిపించారు. ఈ మేరకు రకరకాల వీడియో ఎడిటింగ్‌లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అయితే కాఫీ విత్ కరణ్ షోలోనూ కృతి సనన్.. ప్రభాస్‌కు ఫోన్ చేస్తుంది. మనం ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసే వ్యక్తికే ఫోన్ చేయాలన్నట్టుగా ఉంటుంది రౌండ్. అలా అప్పుడు కృతి క్షణం ఆలోచించకుండా.. ప్రభాస్‌కు ఫోన్ చేస్తుంది. మొత్తానికి కృతి సనన్ ప్రభాస్ మధ్య ఏదో నడుస్తోందన్న టాక్ మాత్రం ఇప్పుడు మరింత ఎక్కువగా వినిపిస్తోంది. ఈడు జోడు కూడా బాగానే ఉందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read : త్రివిక్రమ్‌ని తిట్టింది నేనే.. వాయిస్ నాదే : బండ్ల గణేష్

Also Read : పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి..పొన్నియన్, ఆదిపురుష్ లకు జక్కన్న బ్రదర్ కౌంటర్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News