ధృవ సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు బాగా గ్యాప్ వచ్చేసింది. దానికితోడు సుకుమార్ సినిమా కావడంతో తెరపైకి రావడానికి ఇంకా టైం పడుతోంది. ఇకపై ఇలాంటి గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు రామ్ చరణ్. కుదిరితే నెక్ట్స్ టైం నుంచి ఒకేసారి 2 సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు చరణ్-బోయపాటి కాంబో కూడా ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఇది కూడా ఓకే అయితే.. ఈ 2 ప్రాజెక్టుల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలనుకుంటున్నాడు రామ్ చరణ్.


చిరంజీవి హీరోగా రానున్న సైరా నరసింహారెడ్డి ప్రాజెక్టు డిసెంబర్ నుంచి సెట్స్ పైకి రానుంది. ఈ మూవీకి రామ్ చరణే నిర్మాత. ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే.. తను హీరోగా నటించనున్న 2 సినిమాలపై ఓ నిర్ణయానికి వస్తాడు చరణ్.