RGV : సందీప్ వంగా పాదాల ఫోటో అడిగిన ఆర్జీవీ.. యానిమల్ పై సుదీర్ఘ రివ్యూ ఇచ్చిన డైరెక్టర్
Animal: రాజమౌళి ఈమధ్య యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ తరువాత అలాంటి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏకంగా రాంగోపాల్ వర్మ సందీప్ రెడ్డి పైన అలానే తన యానిమల్ సినిమా పైన వేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది..
Sandeep Reddy Vanga:రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా యానిమల్. డిసెంబర్ 1 విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అంతేకాదు అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆ సందీప్ రెడ్డి వంగ మరోసారి తన మార్కు చూపిస్తూ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు.
కొంతమంది ప్రేక్షకులు ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కానీ మరి కొంతమంది మాత్రం సినిమా వేరే లెవెల్ అంటూ రివ్యూలు పెడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట మాత్రం ఒక్కటే.. రొటీన్ ఫార్మేట్ లో కాకుండా పాత్ బ్రేకర్ గా సందీప్ రెడ్డి ఈ సినిమాను తీశారు అని. ఇక ఒకప్పుడు తన శివా సినిమాతో అప్పట్లో పాత్ బ్రేకర్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు సందీప్ రెడ్డి గురించి ఒక పోస్ట్ వెయ్యడం అందరిని ఆకట్టుకుంది.
యానిమల్ మీద తన రివ్యూ తెలియజేస్తూ ఒక పెద్ద నోట్ రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ రివ్యూ లో అన్నిటికన్నా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం ఏమిటి అంటే .. రాంగోపాల్ వర్మ.. “సందీప్ వంగా నీ పాదాల ఫోటోని నాకు వాట్సాప్ చెయ్యి. వాటిని నేను మొక్కాలి అనుకుంటున్నాను” అని రాయడం.
ఇక సందీప్ రెడ్డి కాళ్ళకి రాంగోపాల్ వర్మ ఎందుకు మొక్కాలి అనుకుంటున్నారు అనేదానికి ఆర్జీవి తన రివ్యూ లో నాలుగు రీజన్స్ చెప్పుకొచ్చారు.
‘మొదటి రీసన్.. మేకర్స్ నమ్మే ప్రతి నియమాన్ని నువ్వు పూర్తిగా బద్దలు కొట్టావు. రెండోది.. బాలీవుడ్లో అయినా, సౌత్ సినిమా అయినా అయినా తమ భవిష్యత్ చిత్రాలకు సంబంధించి ఏదైనా సృజనాత్మక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీ సినిమాలోని సన్నివేశాలు వారిని తప్పకుండా వెంటాడుతాయి. మూడోది.. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ నుండి స్టీవెన్ స్పీల్బర్గ్ వరకు, అలాగే ఈనాటి దర్శకులు.. తమ సినిమాల్లో ఒక పాయింట్ ని చెప్పడానికి వీలైనంత తక్కువ నిడివి ఉండాలని విశ్వసిస్తారు. కానీ నువ్వు వారి నమ్మకాలని కొట్టిపడేశావు. నాలుగవది.. ఇప్పటి నుంచి అన్ని భాషల తారలు ఇలాంటి పాత్రలు నటించాలని కలలు కంటారు. అందువల్ల ఈ సినిమా కొత్త రచయితలు.. దర్శకులను సృష్టిస్తుంది. అలాగే ఇది క్రియేటివిటీ .. ఒరిజినాలిటీ కథలు చూపించేలా చేస్తుంది. కానీ నాకు ఈ సినిమాలో ఒక సన్నివేశం మాత్రం నచ్చలేదు. రణబీర్ తన షూ నాకమని అమ్మాయిని అడగడం నాకు నచ్చలేదు. మిగతా అంతా నాకు నచ్చింది. లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రణబీర్ షాట్ వరకు ప్రతి ఇంచ్ నాకు నచ్చింది. అందుకనే నేను నీ రెండు కాళ్ళు నాకాలని అనుకుంటున్నాను' అంటూ తన రివ్యూ రాశారు ఆర్జీవి.
Also read: Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..
Also Read: Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి