అమ్మ మీద ఒట్టు వేయను: రామ్‌గోపాల్‌వర్మ
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరో సారి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరో సారి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా అందరూ ప్రామిస్ డే జరుపుకుంటూ ఉంటారని .. తాను కూడా ఈ రోజు సందర్భంగా ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే తాను అందరిలా దేవుడిపైనో, తల్లిపైనో ప్రమాణాలు చేయనని.. తనకు ఇష్టమైన బిగ్ బి అమితాబ్, నాగార్జున, స్టీవెన్ స్పీల్బర్గ్, దావుద్ ఇబ్రహిం, బ్రూస్లీ, మియా మల్కోవాపై ఒట్టు వేస్తానని చెప్పారు వర్మ. వీరందరిపై ఒట్టు వేస్తున్నాను కాబట్టి.. ఈ సంవత్సరం నుండి మంచి వ్యక్తిగా, బాధ్యత గల వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు వర్మ. నిన్న మొన్నటి వరకు జీఎస్టీ సినిమాకి సంబంధించి అనేక వివాదాల్లో చిక్కుకున్న వర్మ ప్రస్తుతం నాగార్జునతో తీస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.