Ram Gopal Varma Shocking Comments on SS Rajamouli: టాలీవుడ్ సినీ పరిశ్రమ షూటింగ్స్ అన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు సినిమా ధియేటర్లకు రావడం లేదు కానీ నిర్మాణ వ్యయం అంతకంతకూ పెరిగిపోతోంది. దాన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి అని భావిస్తూ నిర్మాతలు అందరూ ప్రస్తుతానికి షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ వ్యయం కంట్రోల్లోకి వచ్చేలా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ షూటింగ్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అయితే ఈ పరిణామాల మీద రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఒక మీడియా ఛానల్లో మాట్లాడిన ఆయన ప్రస్తుతం ఏర్పడిన ఈ పరిస్థితికి రాజమౌళి అలాగే యూట్యూబ్ కారణమని కామెంట్స్ చేశారు. ఓటీటీ వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదన్న నిర్మాతల వాదనను ఈ కోటిపారేసిన వర్మ తెలుగు సినిమాలకు అసలు శత్రవులు దర్శకుడు రాజమౌళి, యూట్యూబ్‌ అని అన్నారు. అసలు  ఓటీటీల వలన ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. అంతేకాక ప్రస్తుతం ప్రేక్షకులు షాట్‌ వీడియోలకు అలవాటు పడ్డారని, అందుకే ఎక్కువగా యూట్యూబ్‌ని ఫాలో అవుతున్నారని ఆయన అన్నారు.


రాజమౌళి లాంటి దర్శకుడు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్స్ ఇవ్వడం మొదలుపెట్టారని అందుకే ప్రేక్షకులు కూడా రెండు గంటలపాటు తమను అబ్బురపరిచే సినిమా అయితే మాత్రమే ధియేటర్లకు వెళుతున్నారని అన్నారు. రాజమౌళి ఒక ఆటం బాంబు లాంటివారని అలాగే ఒక భూతం అంటూ ఆయన కామెంట్స్ చేశారు.


ఓటీటీల మీద కూడా ఎక్కువ సమయం వెచ్చించడం లేదు కానీ యూట్యూబ్ మీద ప్రేక్షకులు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని రాంగోపాల్ వర్మ అన్నారు. ఎక్కువ సేపు దేని మీద కూడా వాళ్ళు నిలకడగా ఉండడం లేదని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంటూ వాళ్లకు ఇష్టం వచ్చినవి స్క్రోల్ చేస్తూ వెళుతున్నారని అవన్నీ పక్కనపెట్టి రెండు గంటలపాటు థియేటర్లో కూర్చోవాలి అంటే ఆర్ఆర్ఆర్  లేదా కేజిఎఫ్ లాంటి విజువల్ వండర్స్ మాత్రమే రావాలని చెప్పుకొచ్చారు.  


Also Read: Mithilesh Chaturvedi: బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం!


Also Read: Pranitha Subhash: కాళ్ల దగ్గర కూర్చుని పూజ చేస్తే తప్పేంటి.. నెటిజన్ల కామెంట్లకు ప్రణీత సుభాష్ ఘాటు కౌంటర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook