Ram Gopal Varma Romantic రామ్ గోపాల్ వర్మ మాట్లాడే మాటలు, చేసే చేష్టలు, పెట్టే ట్వీట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బహిరంగంగానే శృంగారం గురించి మాట్లాడతాడు. ఆడవాళ్ల అందాలను పొగుడుతుంటాడు. మగజాతి అంటే తనకు అసహ్యమని, ఆడజాతిని తాను ఎంతగానో ప్రేమిస్తాను అంటూ వర్మ చెప్పే మాటలు జనాలను మరీ ముఖ్యంగా యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. తాజాగా వర్మ షేర్ చేసిన ఫోటో చూస్తే ఆయన ఎంత నాటీయో అని అంతా అనుకోవాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్మ ఆ మధ్య అషూ రెడ్డితో చేసిన ఇంటర్వ్యూను అంతా ఎంతలా ఛీ కొట్టారో అందరికీ తెలిసిందే. అషూ రెడ్డితో ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా ఆమె కాలిని చీకడంతో ఎంతటి రాద్దాంతం జరిగిందో అంత ఈజీగా మర్చిపోలేరు. అటు అషూని, ఇటు ఆర్జీవీనీ సోషల్ మీడియా మొత్తం దారుణాతి దారుణంగా తిట్టేసింది. అయినా ఆర్జీవీ మారడన్న సంగతి తెలిసిందే.


 



తాజాగా ఆర్జీవీ ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులోని ఐటంలు చూస్తే.. ఎంతటి రసికుడివో తెలిసెరా అంటూ పాట పాడాల్సిందే. పక్కనే వోడ్కా గ్లాసు.. చేతికి మల్లెపూల దండి.. ఇక అమ్మాయి చేతిని జుర్రుకుంటూ ఆర్జీవీ కనిపించిన తీరు చూస్తే జనాల మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఉంది ఆ ఫోటో.


మొత్తానికి వర్మ అయితే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడనే కామెంట్లు వస్తున్నాయి. పాదాలు మాత్రమే కాదు.. చేతిని కూడా అంటూ వర్మ వేసిన కామెంట్‌ మీద జనాలు సెటైర్లు వేస్తున్నారు. వర్మ ఈ మధ్య ఎక్కువగా అంబర్ పేట్ కుక్కల దాడి ఘటన మీద స్పందించి మీడియాలో హైలెట్ అయ్యాడు. మేయర్‌ను టార్గెట్ చేస్తూ వర్మ చేసిన కామెంట్లు, వదిలిన వీడియోలు జనాలను బాగానే ఆకట్టుకున్నాయి.


ఇక ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? నైనా గంగూలినా? అప్సరా రాణియా? లేక ఇంకో కొత్త భామనా? అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైతే వర్మ సదరు అమ్మాయి వివరాలు అయితే వెల్లడించలేదు. ఇక అర్దరాత్రి రెండు మూడు వోడ్కా సీసాలు లేపేస్తే ఆ వివరాలు కూడా ట్వీట్ చేస్తాడేమో చూడాలి.


Also Read:  Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్


Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్‌ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook